ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా

లాక్ డౌన్ ఎత్తివేత మొదలైన నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. కుటుంబాలకు కుటుంబాలు కరోనా బారిన పడుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలోను కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ..

ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా
Follow us

|

Updated on: Jun 11, 2020 | 11:51 AM

లాక్ డౌన్ ఎత్తివేత మొదలైన నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. కుటుంబాలకు కుటుంబాలు కరోనా బారిన పడుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలోను కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకేరోజు 31 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 832కు చేరింది.

తాజాగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో ఆదోనిలో అత్యధికంగా రికార్డయ్యాయి. ఆదోనిలో మొత్తం 23 మందికి కరోనా సోకింది. ఈ పట్టణంలో ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా సోకడం కలకలం రేపింది. కొత్త కేసుల్లో ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులే అత్యధికంగా వున్నారు. గుంటూరు జిల్లాలో మరో 9 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన ముగ్గురికి, హైదరాబాద్‌ నుంచి వచ్చిన మరో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడం, దేశవ్యాప్తంగా రైళ్ళు, విమానాల రాకపోకలు పెద్ద ఎత్తున కొనసాగుతుండడం కూడా కరోనా కేసుల్లో పెరుగుదలకు కారణం అవుతుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఒకరికి సోకినా వారిని క్వారెంటైన్‌లో పెట్టాల్సిన అవసరం వుందని చెబుతున్నారు. కరోనా కేసుల సంఖ్య మరో రెండు నెలల పాటు విపరీతంగా పెరుగుతుందన్న ఆందోళన వినిపిస్తోంది.