బట్టతలపై విగ్గు… అమ్మాయిలకు ముగ్గు… మోసగాని ఆటకట్టు
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాలకు చెందిన అవుజ రాజ్ కుమార్ అనే ఘరానా మోసగాని ఆటకట్టించారు జిల్లా పోలీసులు. మాయమాటలు చెప్పి అమ్మాయిలతో పరిచయం చేసుకోవడం....

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాలకు చెందిన అవుజ రాజ్ కుమార్ అనే ఘరానా మోసగాని ఆటకట్టించారు జిల్లా పోలీసులు. మాయమాటలు చెప్పి అమ్మాయిలతో పరిచయం చేసుకోవడం.. తన బట్టతలకు విగ్గుపెట్టుకుని ఆకర్షనీయమైన మాటలతో అమ్మాయిలతో సన్నిహితంగా మెలుగుతూ వారితో ఫోటోలు దిగడం… అనంతరం ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగికంగా లొంగదీసుకోవడం… ఇలా కొనసాగుతున్న రాజ్ కుమార్ మోసపు చేతలకు పోలీసులు ముగింపు పలికారు.
అమ్మాయిలను బ్లాక్ మెయిల్ ఘట్టంలో వారి నుంచి బంగారం, డబ్బు తీసుకున్న అంశాలు కూడా వెలుగు చూశాయి. రాజ్ కుమార్‌పై ఇతర రాష్ట్రాలతో కలిపి మొత్తం 11 కేసులు వున్నట్లు సమాచారం. రాజుపాలెం మండలంలో ప్రైవేట్ స్కూలును లీజుకు తీసుకుని నడుపుతున్న ఓ టీచర్‌ను లైంగికంగా వేదించి, ఆమెను అపహరించిన కేసులో గతంలో రాజ్ కుమార్ జైలుకు కూడా వెళ్ళొచ్చినట్లు సమాచారం. తాజాగా పలువురు రాజ్ కుమార్‌పై ఫిర్యాదు చేయడంతో అతని ఆటకట్టించారు జిల్లా పోలీసులు.




