పుల్వామా ఉగ్రదాడిలో ప్రధాన సూత్రదారి అరెస్ట్

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రదారిని ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది సజ్జన్ ఖాన్ను ఇవాళ ‌ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ సెల్ పోలీసులు రెడ్ పోర్టు ప్రాంతంలో సజ్జన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. పుల్వామా దాడిలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ముదసిర్ అహ్మద్ ఖాన్ కు సజ్జన్ ఖాన్ అత్యంత సన్నిహితుడిగా పోలీసులు భావిస్తున్నారు. దక్షిణ కశ్మీర్ […]

పుల్వామా ఉగ్రదాడిలో ప్రధాన సూత్రదారి అరెస్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 22, 2019 | 3:13 PM

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రదారిని ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది సజ్జన్ ఖాన్ను ఇవాళ ‌ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ సెల్ పోలీసులు రెడ్ పోర్టు ప్రాంతంలో సజ్జన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. పుల్వామా దాడిలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ముదసిర్ అహ్మద్ ఖాన్ కు సజ్జన్ ఖాన్ అత్యంత సన్నిహితుడిగా పోలీసులు భావిస్తున్నారు. దక్షిణ కశ్మీర్ లోని ట్రాల్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ సమయంలో ముదసిర్ అహ్మద్ ఖాన్ ను భద్రతాబలగాలు అదుపులోకి తీసుకున్నాయి. జాతీయ దర్యాప్త సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ముదసిర్ ఖాన్ ను ఢిల్లీలో శాలువాలు అమ్ముతుండగా పోలీసులు గుర్తించారు.