హైకోర్టులో చిరు సినిమాకు నిరాశ, మారుతీకి చుక్కలు చూపిస్తున్న రెబల్ ఫ్యాన్స్
హైకోర్టులో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారంపై దాఖలైన అప్పీల్‌ను ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. టికెట్ల ధరల పెంపుదల నిర్ణయం విడుదలకు 90 రోజుల ముందే ఉండాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. షైన్ స్క్రీన్ ఇండియా ఎల్‌ఎల్‌పీకి నిరాశ ఎదురైంది.
హైకోర్టులో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారంపై కీలక తీర్పు వెలువడింది. రీసెంట్‌గా మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోంశాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి, సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం విడుదలకు 90 రోజుల ముందే ఉండాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా, షైన్ స్క్రీన్ ఇండియా ఎల్‌ఎల్‌పీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాత షైన్ స్క్రీన్ ఇండియా ఎల్‌ఎల్‌పీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు, షాకింగ్ తీర్పును వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. మెరిట్స్ ఉంటే సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ, అప్పీల్‌లో విచారణను ముగించింది. ఈ పరిణామం సినీ పరిశ్రమలో, ముఖ్యంగా టికెట్ల ధరల పెంపుదల ఆశించిన నిర్మాతలకు నిరాశను కలిగించింది.
శివపార్వతుల కల్యాణంలో సాక్షాత్కరించిన నాగరాజు
కోటి దీపాల వెలుగుల్లో..మహాశివరాత్రి వైభవం
అర్ధరాత్రి వేళ భక్తుడి ప్రాణాలు కాపాడిన అటవీ సిబ్బంది
చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగం..
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము
ఐదుగురి ప్రాణాలను నిలిపిన చిన్నారి

