AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ మంత్రి లాక్ డౌన్ ఉల్లంఘన.. పోలీస్ కేసు నమోదు ?

ఢిల్లీ ఆహార శాఖ మంత్రి ఇమ్రాన్ హుసేన్ కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించి దర్జాగా కారులో మందీ మార్బలాన్ని వెంటేసుకుని తిరుగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వైరస్ హాట్ స్పాట్ అయిన సదర్ బజార్ లో తన 25 మంది మద్దతుదారులు..

ఢిల్లీ మంత్రి లాక్ డౌన్ ఉల్లంఘన.. పోలీస్ కేసు నమోదు ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 28, 2020 | 10:05 AM

Share

ఢిల్లీ ఆహార శాఖ మంత్రి ఇమ్రాన్ హుసేన్ కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించి దర్జాగా కారులో మందీ మార్బలాన్ని వెంటేసుకుని తిరుగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వైరస్ హాట్ స్పాట్ అయిన సదర్ బజార్ లో తన 25 మంది మద్దతుదారులు, అనుచరులతో  ఆయన ఆర్భాటంగా కార్లలో కలయ దిరిగాడట. ఈ ‘మార్బలం’ లో ఓ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, ఓ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కూడా ఉన్నారని సమాచారం. ఇమ్రాన్ హుసేన్ నిర్వాకాన్ని పోలీసులు ప్రశ్నించినప్పుడు.. అడ్డంగా వాదించాడని తెలిసింది. ఆయనకు, వారికి మధ్య జరిగిన  వాగ్యుధ్ధం వీడియోలో రికార్డయింది. లాక్ డౌన్ అమలులో ఉండగా.. సామాజిక దూరాన్ని పాటించకుండా ఇలా రోడ్లపై ఇష్టానుసారం తిరగడమేమిటని, మీరు మంత్రి అయితే మాత్రం రూల్స్ ని అతిక్రమిస్తారా అని ఖాకీలు ఆయనను ధైర్యంగా ప్రశ్నించారు. చివరకు ఆయనపై కేసు నమోదు చేయాలనే నిర్ణయించారు. ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 190 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,108  కి పెరిగింది. అయితే వరుసగా రెండో రోజు ఎలాంటి డెత్ కేసూ నమోదు కాలేదు.

యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారా .. జాగ్రత్త.. వీడియో
యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారా .. జాగ్రత్త.. వీడియో
బొగ్గుల కుంపటిని వెలిగించారు.. తెల్లారేసరికే విషాదం వీడియో
బొగ్గుల కుంపటిని వెలిగించారు.. తెల్లారేసరికే విషాదం వీడియో
కాన్పు తర్వాత కడుపునొప్పి.. స్కాన్ చేస్తే లోపలున్నది చూసి షాక్‌
కాన్పు తర్వాత కడుపునొప్పి.. స్కాన్ చేస్తే లోపలున్నది చూసి షాక్‌
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో
2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో
రాజాసాబ్ న్యూ ట్రైలర్.. ఆ మూడు గమనించారా..? వీడియో
రాజాసాబ్ న్యూ ట్రైలర్.. ఆ మూడు గమనించారా..? వీడియో
ప్లాప్స్ వస్తే గానీ.. మార్పు రాలేదన్నమాట వీడియో
ప్లాప్స్ వస్తే గానీ.. మార్పు రాలేదన్నమాట వీడియో
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు ఎన్నిక వీడియో
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు ఎన్నిక వీడియో