వైరస్ వ్యాప్తికి వైసీపీ నేతలే కారణం: చంద్రబాబు బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరించడానికి కారణం వైసీపీ పాలకుల వైఫల్యమేనని నిప్పులు చెరిగారు విపక్ష నేత చంద్రబాబు నాయుడు. కరోనా వైరస్‌పై నాయకులు, ప్రభుత్వాధినేతలు చేసిన ప్రకటనల వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ కేవలం వారం రోజుల్లో రెట్టింపు అయిందని చంద్రబాబు ఆరోపించారు

వైరస్ వ్యాప్తికి వైసీపీ నేతలే కారణం: చంద్రబాబు బహిరంగ లేఖ
Follow us

|

Updated on: Apr 28, 2020 | 10:20 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరించడానికి కారణం వైసీపీ పాలకుల వైఫల్యమేనని నిప్పులు చెరిగారు విపక్ష నేత చంద్రబాబు నాయుడు. కరోనా వైరస్‌పై నాయకులు, ప్రభుత్వాధినేతలు చేసిన ప్రకటనల వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ కేవలం వారం రోజుల్లో రెట్టింపు అయిందని చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నేత మంగళవారం బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం ‘‘పెనం మీదనుంచి పొయ్యిలోకి’’ నెట్టిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. మొదట తేలిగ్గా మాట్లాడటం, ఆ తర్వాత చేతగానితనం బయటపెట్టడం పాలకుల లక్షణం కాదని విమర్శించారు. ‘‘కరోనా వస్తుంది, పోతుంది, పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’’ అని తేలిగ్గా వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు ‘‘కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టాయి అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని, తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళ్లడం మనసు కలిచివేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులవారు, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని తెలిపారు. రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, పండించిన పంటలు పొలంలో, రోడ్డుమీద వదిలేస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. రైతులను ఆదుకోవాలని అనేక లేఖలు రాసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని చంద్రబాబు ఆరోపించారు.

పొరుగు రాష్ట్రం కొన్న ధాన్యంలో పదో వంతు కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం కొనలేదని చంద్రబాబు చెబుతున్నారు. పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే ఇప్పుడీ అకాల వర్షాలు, తుపాన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేది కాదని అయనంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు నిబంధనలు పాటించలేదని నిర్లక్ష్యంగా, బాధ్యతా రహితంగా వ్యవహరించారని చంద్రబాబు ఆరోపించారు. అందువల్లే కరోనా వైరస్ రోజురోజుకూ ఉధృతం అవుతుందని చంద్రబాబు అంటున్నారు.

‘‘ శ్రీకాళహస్తిలో ట్రాక్టర్లతో ర్యాలీలు జరపడం, నగరిలో పూలు జల్లుకుంటూ ప్రారంభోత్సవాలు జరపడం, పొరుగు రాష్ట్రం నుంచి అనుచరులను కనిగిరి ఎమ్మెల్యే తరలించడం, లాక్ డౌన్ లో కూడా కొండెపిలో బహిరంగ సభలు పెట్టడాన్ని జాతీయ మీడియా కూడా తప్పుపట్టింది’’ అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

” చౌకడిపో క్యూలైన్లలో వందలాది మందిని క్యూలైన్లలో గంటల తరబడి నిలబెట్టారు..కరోనా వైరస్ వ్యాప్తికి ఇది మరో కారణం.. లాక్ డౌన్ లోనూ యధేచ్చగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.. హెల్త్ బులెటిన్లను ఫార్స్ గా మార్చారు-కరోనా కిట్లలోనూ అవినీతికి పాల్పడ్డారు.. కరోనా టెస్టింగ్ లను నిర్లక్ష్యం చేయడమే మనరాష్ట్రంలో పెను విషాదం…” అని ఘాటైన పదజాలంతో రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు విపక్షనేత చంద్రబాబు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో