AP Covid curfew Extended: కరోనా కట్టడిలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. జూన్‌ 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 10 రోజుల పాటు కర్ఫ్యూ పొడిగించింది. రాష్ట్రంలో జూన్‌ 20 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.

AP Covid curfew Extended: కరోనా కట్టడిలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. జూన్‌ 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు
Covid Curfew In Andhra Pradesh
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 07, 2021 | 1:49 PM

Covid curfew in Andhra Pradesh extended: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 10 రోజుల పాటు కర్ఫ్యూ పొడిగించింది. రాష్ట్రంలో జూన్‌ 20 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కర్ఫ్యూ వేళల్లో కాస్త సమయాలను మార్పులు చేసింది ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు ఇస్తున్నట్లు పేర్కొంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఉ.8 గంటల నుంచి మ.2 గంటల వరకు పనిచేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌పై సమీక్ష చేపట్టారు. ఏపీలో నేటితో కర్ఫ్యూ ఆంక్షలు ముగియడంతో జూన్‌ 20 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Read Also…. Ivermectin, Doxycycline: అత్యవసరమైతే తప్ప సీటీ స్కాన్ వద్దు.. కోవిడ్ చికిత్స నుంచి ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్‌ తొలగించిన కేంద్రం