Anandaiah Eye Drops: ఆనందయ్య మందుకు తొలగిన అడ్డంకి.. ఐ డ్రాప్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందులో ఒకటైన K ఔషధానికి ఏపీహైకోర్టు అనుమతిచ్చింది.
Anandaiah Eye Drops: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందులో ఒకటైన K ఔషధానికి ఏపీహైకోర్టు అనుమతిచ్చింది. గతంలో ఆనందయ్య ఇతర మందులకు హైకోర్టు ఆదేశాలతో అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి ఇవ్వలేదు. ఆయుష్ నివేదికకు సంబంధించి పూర్తి వివరాలు రాని నేపథ్యలో దీనికి అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా బాధితులకు తక్షణమే K మందు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఇప్పటికే ఆనందయ్య పసరు మందుకు పర్మిషన్ ఇచ్చిన కోర్టు…ఐ డ్రాప్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరోవైపు, ఆనందయ్య మందు పంపిణీ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. నెల్లూరుజిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని గొలగమూడిలో పసరు మందు పంపిణీ ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా డోర్ టు డోర్.. పంపిణీ షురూ అయ్యింది. కరోనా పాజిటివ్ వచ్చినవారికి ముందుగా మందు ఇవ్వాలని నిర్ణయించారు. 3 రోజులపాటు ఇంటింటికీ ఆనందయ్య మందు పంపిణీ చేయనున్నారు.
అయితే, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే ఆనందయ్య మందు తయారు చేశారు. లక్ష, నుండి లక్షన్నర మందికి మూడు రకాలైన మందులు తయారు చేసినట్టు తెలుస్తోంది. రోజుకు 2 వేల నుండి 4 వేల వరకూ వాలంటీర్లు డెలివరీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన్న ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే మందు పంపిణీకి దాదాపు వారం నుండి 10 రోజులపైనే పడుతుంది.
మరోవైపు అటు చంద్రగిరి నియోజకవర్గంలోనూ ఆనందయ్య కుమారుడు శ్రీధర్ మందు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే శేషాచలం అడవుల్లో నుండి పెద్దయెత్తున్న వనమూలికలను తెప్పించారు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. రోజుకు రెండు టన్నుల మందు తయారీ లక్ష్యంగా పని చేస్తున్నారు. పని ప్రారంభమై నాలుగైదు రోజులైనా…ఇవాళ సాయంత్రానికల్లా మందు తయారీ పూర్తవుతుందని చెబుతున్నారు. అయితే వాటిని మందు గుళికలుగా మార్చి, పంపిణీకి సిద్ధం చేయడానికి మరో రెండ్రోజులైనా పడుతుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం లేదా…గురువారం నుండి చంద్రగిరిలో మందు పంపిణీ షురూ కావొచ్చని…అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.
Read Also…. AP Covid curfew Extended: కరోనా కట్టడిలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు