Anandaiah: ప్రభుత్వం నుంచి అనుమతులు తప్ప.. సహకారం లేదు: ఆనందయ్య కీలక వ్యాఖ్యలు

Anandaiah on AP Govt: ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఔషధం పంపిణీ కొనసాగుతుందని ఆనందయ్య స్పష్టంచేశారు. ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు

Anandaiah: ప్రభుత్వం నుంచి అనుమతులు తప్ప.. సహకారం లేదు: ఆనందయ్య కీలక వ్యాఖ్యలు
Krishnapatnam Anandaiah
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 07, 2021 | 11:37 AM

Anandaiah on AP Govt: ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఔషధం పంపిణీ కొనసాగుతుందని ఆనందయ్య స్పష్టంచేశారు. ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఔషధం అందిస్తామని.. స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆయన సూచించారు. కొన్ని ఆటంకాల వల్ల ఔషధ పంపిణీ సవ్యంగా సాగట్లేదంటూ ఆనందయ్య ఆవేదన వ్యక్తంచేశారు. పంపిణీకి వనరులు సమకూరడం లేదని.. విద్యుత్‌ సౌకర్యం, ఔషధ తయారీ యంత్ర సామగ్రి లేదని ఆనందయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప.. ఇప్పటివరకు సహకారం లేదని ఆనందయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధాన్ని అందిస్తామంటూ ఆయన వెల్లడించారు.

అయితే మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని నియోజవర్గంలోనే పాజిటీవ్ బాధితుల ఇంటి వద్దకే మందు చేర్చాలని చూస్తున్నామని ఆనందయ్య తెలిపారు. కృష్ణపట్నంలో పూర్తి అయిన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు మందు పంపిణీ చేస్తామని తెలిపారు. మందు కావలసినవారు అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని ఆనందయ్య సూచించారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే మందు పంపిణీ జరుగుతుందని ఆనందయ్య పేర్కొన్నారు. కాగా ఆనందయ్య కరోనా మందుకు ‘ఔషధచక్ర’గా నామకరణం చేశారు.

Also Read:

Corona Third Wave: క‌రోనా థార్డ్ వేవ్ నేప‌థ్యంలో చిన్నారుల‌కు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే.

పోలీస్ స్టేషన్ లో ‘వింత ప్రొటెస్టర్’….హర్యానా రైతుల ఐడియా ఇచ్చిన ‘కిక్కే’ వేరప్పా…! దిగొచ్చిన ఖాకీలు