Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Third Wave: కర్ణాటకలో తగ్గని కరోనా మరణాలు… థర్డ్ వేవ్ ఊహాగానాలతో వణికిపోతున్న జనం

Karnataka - Coronavirus Third Wave: కరోనా థర్డ్ వేవ్ మొదలైందా ? కర్నాటకలో కొత్తగా నమోదవుతున్న కేసులను చూస్తే ఇదే సందేహం కలుగుతోంది.

Covid-19 Third Wave: కర్ణాటకలో తగ్గని కరోనా మరణాలు... థర్డ్ వేవ్ ఊహాగానాలతో వణికిపోతున్న జనం
Representative Image
Follow us
Janardhan Veluru

| Edited By: Team Veegam

Updated on: May 22, 2021 | 10:12 PM

కరోనా థర్డ్ వేవ్ మొదలైందా ? కర్నాటకలో కొత్తగా నమోదవుతున్న కేసులను చూస్తే ఇదే సందేహం కలుగుతోంది. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్‌కీ… సెకండ్ వేవ్‌కీ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. సెకండ్ వేవ్‌లో డైలీ కేసులు భారీగా పెరగడమే కాదు… వ్యాప్తి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక థర్డ్ వేవ్ కూడా వస్తే… అప్పడు పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయం కలుగుతోంది. దేశంలో మిగిలిన రాష్ట్రాలకు భిన్నమైన రీతిలో కర్ణాటకలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. పెద్ద, మధ్య వయస్కులు, యువకుల్లో కాకుండా అక్కడ పదేళ్ల లోపు పిల్లల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కరోనా కొత్త మ్యూటెంట్లు ఏమైనా వచ్చాయా ? థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు కర్నాటక నుంచి వెలువుడుతున్నాయా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

లాక్డౌన్ విధించి రెండు వారాలు దాటినా కర్నాటకలో కరోనా కంట్రోల్ కావడం లేదు. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత కర్నాటకలో చిన్నారులు కరోనా బారిన పడుతున్నారు. మార్చి నుంచి మే వరకు 9 ఏళ్లలోపు వారిలో ఏకంగా 39, 846మంది కరోనా బారిన పడగా..10 నుంచి 19 ఏళ్ల కేటగిరీలో అయితే రికార్డు స్థాయిలో1,05,044 మందికి కరోనా సోకింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. గతేడాది దేశంలో కరోనా తొలి కేసు మొదలైనప్పటి నుంచి 2021 మార్చి వరకు కరోనా కేసులు నమోదైన తీరును పరిశీలిస్తే 9 ఏళ్లలోపు 27, 841 కేసులు ఉండగా 10 నుంచి 19 ఏళ్ల లోపు వారు 65,551గా నమోదైంది.

అంటే స్వల్ప వ్యవధిలోనే చిన్నారుల్లో 145 శాతం అధికంగా టీనేజ్ పిల్లల్లో 160 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. మరణాల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.  గతేడాది నుంచి మార్చి వరకు 9 ఏళ్ల లోపు వారు 28 మంది చనిపోగా కేవలం ఈ రెండు నెలల్లోనే ఇప్పటికే 15 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు. టీనేజి పిల్లల దగ్గరికి వచ్చే సరికి మరణాల సంఖ్య46 నుంచి 62 కి చేరుకుంది. ఇంట్లో కరోనా సోకిన పెద్ద వాళ్లకు ప్రైమరీ కాంటాక్టుగా పిల్లలు ఉండటం వల్లనే చిన్న పిల్లలు కరోనా బారిన పడుతున్నారనే వాదనలు ఉన్నాయి.

Covid-19 NEWS

Representative Pic

ఫస్ట్ వేవ్‌లో పెద్ద వయసువారు, సెకండ్ వేవ్లో యువత ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. థర్డ్ వేవ్లో చిన్నారులకు ముప్పు ఉంటుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. చిన్నారులు కరోనా బారిన పడటానికి కారణం ఇండియన్‌లో నమోదవుతున్న కొత్త రకం స్ట్రెయినా, సింగపూర్ స్ట్రెయినా అనే వాదనలు కొనసాగుతుండగానే కర్నాటకలో చిన్నారుల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పద్దేనిమిదేళ్లు దాటిన వారికే ప్రస్తుతం టీకాలు ఇచ్చే పరిస్థితి దేశంలో కనిపించడం లేదు. ఇప్పుడు 18 ఏళ్లలోపు ఏజ్ గ్రూప్లోనూ కేసులు పెరగడం కలవరం కలిగిస్తోంది.

2021, మే 20 నాటికి కర్ణాటక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు – 23,35,524 ఇందులో ఒక్క బెంగళూరు నగరంలోనే నమోదైన కేసులు – 10,94,253 అంటే మొత్తం కేసులలో బెంగళూరు నగరం వాటా 46 శాతం పైగా ఉంది రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులు – 9,409 నమోదైన మొత్తం కరోనా మరణాలు -23,854 నిన్న ఒక్క రోజే నమోదైన మరణాలు – 548 రికవరీ అయిన వారు మొత్తం – 17,76,695 ప్రస్తుతం ఉన్న యాక్టివ్‌ కేసులు – 5,34,954 యాక్టివ్‌ కేసుల శాతం – 22.9

ప్రస్తుతం కర్ణాటకలో యాక్టివ్‌ కేసులు 5 లక్షలకు పైగా ఉండటమే ప్రధానంగా ఆందోళణకు కారణం. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా టీకా పొందినవారి సంఖ్య 1,17,99,162. మహారాష్ట్ర తరువాత దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదౌతున్నది కర్ణాటకలోనే కావడం ఆందోళనకర పరిణామం.

గత నెల రోజులుగా కర్ణాటకలో నమోదౌతున్న కరోనా కేసుల తీరు ఇలా ఉంది.

సెకండ్‌ వేవ్‌లో కర్ణాటకలో కరోనా కేసులు  (తేదీ – రోజువారీ కేసులు – రోజువారీ మరణాలు) 15/03/2021 – 932 – 7 1/4/2021  – 4,234  – 18 15/04/2021  – 14,738 – 66 1/5/2021 – 40,990 – 271 2/5/2021 – 37,733 – 217 3/5/2021 – 44,438  – 239 4/5/2021 –  44,631 – 288 5/5/2021 – 50,112  – 346 6/5/2021 – 49,058 – 328 7/5/2021 – 48,781  – 592 8/5/2021 – 47,563  – 482 9/5/2021 – 47,930  – 490 10/5/2021 – 39,305 – 596 11/5/2021 – 39,510  – 480 12/5/2021 –  39,998 – 516 13/5/2021 –  35,297 – 344 14/5/2021  – 41,779 –  373 15/5/2021 –  41,664 – 349 16/5/2021 – 31,531 – 403 17/5/2021 – 38,603 – 476 18/5/2021 – 30,309 – 525 19/5/2021 – 34,281 – 468 20/05/2021 – 28,869 – 548

Read Also: అధిక ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు.. రూల్స్ పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలుః హరీష్ రావు

అమలాపురంలో ఆస్పత్రులకు షాకిచ్చిన అధికారులు.. అధిక ఫీజు వసూలు చేసినందుకు రూ.7 లక్షల జరిమానా

అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ దేవ్ బాబా.. మండిపడుతున్న వైద్య సంఘాలు..