Anandayya medicine : సీఎం సూచనల మేరకు కృష్ణపట్నం చేరుకున్న ICMR బృందం.. ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుపై పరిశీలన

ICMR team in Krishnapatnam : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఐసీఎంఆర్ బృందం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చేరుకుంది..

Anandayya medicine : సీఎం సూచనల మేరకు కృష్ణపట్నం చేరుకున్న ICMR బృందం..  ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుపై పరిశీలన
Icmr Team At Krishnapatnam
Follow us
Venkata Narayana

|

Updated on: May 22, 2021 | 9:33 AM

ICMR team in Krishnapatnam : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఐసీఎంఆర్ బృందం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చేరుకుంది. ఈ సందర్భంగా కరోనా ఆయుర్వేద మందుగా ఆనందయ్య తయారుచేసే వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు. తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందు లో ఏమేమి వస్తువులు కలుపుతున్నారు ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాలను దగ్గరుండి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయుర్వేద మందు వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అనే విషయాన్ని ఐసీఎంఆర్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తదితరులు కూడా ఐసీఎంఆర్ బృందంతో ఉన్నారు. ఇలా ఉండగా, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తోన్న మందు ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే, ఇవాళ్టి నుంచి మళ్లీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా మందు కోసం జనం ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య కరోనా మందు తీసుకోవడంతోనే తన ప్రాణాలు నిలబడ్డాయంటూ అనేక మంది కరోనా నుంచి బయటపడ్డ వాళ్లు చెప్పుకొస్తున్నారు. “ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్న నాకు ఇంకా రెండు నిముషాలు ఆగితే చనిపోయే పరిస్థితి. ఈ క్రమంలో మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నా.. ఈ మందు చాలా అద్భుతం” అని కృష్ణపట్నం మందు వేసుకున్న ఓ రిటైర్డ్ మాస్టారు చెప్పారు. ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టడం మొదలైంది.

Read also : KCR : నేటితో పూర్తైన తొలి విడత ఫీవర్ సర్వే.. ప్రధాన ఆసుపత్రుల్లో పరిశుభ్రత, పూర్తిస్థాయి లైటింగ్ ఏర్పాటుకు కేసీఆర్ ఆదేశం