KCR : నేటితో పూర్తైన తొలి విడత ఫీవర్ సర్వే.. ప్రధాన ఆసుపత్రుల్లో పరిశుభ్రత, పూర్తిస్థాయి లైటింగ్ ఏర్పాటుకు కేసీఆర్ ఆదేశం

CM KCR review meeting on Government Hospitals and corona : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటింటి ఫీవర్ సర్వే నేటితో పూర్తయిందని..

KCR : నేటితో పూర్తైన తొలి విడత ఫీవర్ సర్వే.. ప్రధాన ఆసుపత్రుల్లో పరిశుభ్రత, పూర్తిస్థాయి లైటింగ్ ఏర్పాటుకు కేసీఆర్ ఆదేశం
CM KCR
Follow us
Venkata Narayana

|

Updated on: May 21, 2021 | 7:41 PM

CM KCR review meeting on Government Hospitals and corona : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటింటి ఫీవర్ సర్వే నేటితో పూర్తయిందని, వెంటనే తిరిగి రెండవ రౌండ్ సర్వే ప్రారంభిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణపై నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్.పి లతో రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి ఈ వీడియో కాన్ఫ్ రెన్స్ కు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు 2,68,000 మందికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల ద్వారా జ్వర పరీక్షలు చేశామని వివరించారు. జ్వరంతో ఉన్న వారికి ఉచితంగా మెడికల్ కిట్ లను అందచేశామని పేర్కొన్నారు. నగరంలో నిర్వహిస్తున్న ఇంటింటి ఫీవర్ సర్వే నేటితో పూర్తవుతున్నందున వెంటనే రెండో రౌండ్ సర్వేను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 11 ప్రధాన ఆసుపత్రులను పరిశుభ్ర పరిచి, లైటింగ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఆసుపత్రుల్లో వృథాగా పడి ఉన్న వస్తువులు, పాత ఫర్నీచర్ ను పూర్తిగా తొలగించామని చెప్పారు. అన్నీ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో లైటింగ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఆక్సిజన్ కు ఏ విధమైన కొరత లేదని, ప్రస్తుతం 5800 సిలిండర్లు అందుబాటులో ఉండగా కేవలం 5000 ఆక్సిజన్ సిలిండర్లు మాత్రమే సరిపోతున్నాయని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 720 , మేడ్చల్ జిల్లాలో 435 బృందాలతో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని తెలియచేసారు. జీహెచ్ఎంసీ సహకారంతో అన్ని ముఖ్య ఆసుపత్రులను పరిశుభ్ర పరిచి తగు లైటింగ్ ను ఏర్పాటు చేశామని చెప్పారు.

కాగా, నగరంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని, ఉదయం 10 గంటల అనంతరం అనుమతి పొందిన వారు మినహా మరెవ్వరూ వీధుల్లో ఉండరాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని అన్ని ఆసుపత్రులను పరిశుభ్రపరిచి పూర్తిస్థాయిలో లైటింగ్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read also : Corona Ayurveda medicine : ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీపై స్పష్టతనిచ్చిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి