Tighten Lockdown: తప్పుడు పత్రాలతో రోడ్లపైకి వస్తే కఠినచర్యలు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ సీపీ
భాగ్యనగరంలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.
Tighten Lockdown in Telangana: భాగ్యనగరంలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇవాళ జంటనగరాల పరిధిలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తనిఖీ నిర్వహించారు.
ప్రజలు అనవసరంగా బయటికి వస్తే కేసులు తప్పవని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. ఎమర్జెన్సీ, మెడికల్, మెడిసిన్, హాస్పిటల్ వెళ్ళే వారిని, ఎసెన్షియల్ సర్వీసెస్ అనుమతిస్తున్నామన్నారు. టైమ్ పాస్ కోసం పాసులు వెంట తెచ్చుకున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. నగరవ్యాప్తంగా 180 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని, ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లను పరిశీలించినట్లు చెప్పారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా చేకింగ్స్ నిర్వహిస్తున్నారని…ఆయ చెక్‌పోస్ట్‌ల వద్ద నిన్నటి నుండి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూనే ఉందని తెలిపారు. లాక్‌డౌన్ ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలు సీజ్ చేస్తామని…తమ సిబ్బంది కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 65కు పైగా వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. నగర ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లల్లో ఉండాలని ఆయన సూచించారు.
Your safety is more important than your convenience. Hyderabad Police will be very strict in enforcement of LOCKDOWN. In case you are seen after 10 am in my PS limits without authorized Police Pass, case will be booked and your vehicles will be seized.
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 21, 2021
;
Read Also… Viral: పోలీసుల నుంచి తప్పించుకున్న దొంగ.. ఎక్కడ దాక్కున్నాడో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!