మొన్న 30వేలు.. ఇప్పుడు 3లక్షల మ్యాప్‌లు ధ్వంసం చేసిన చైనా.. ఎందుకో తెలుసా..?

బీజింగ్ : చైనా కస్టమ్స్ అధికారులు మూడు లక్షల ప్రపంచ పటాలను ధ్వంసం చేయాలని ఆదేశించారు. వీటిని నెదర్లాండ్స్‌కు అక్రమంగా ఎగుమతి చేయాలని చూసిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గత నెలలోనూ చైనా ఇలాగే 30 వేల ప్రపంచ పటాలను ధ్వంసం చేసింది. దీనికి కారణం.. ఈ ప్రపంచ పటాల్లో అరుణాచల్‌ప్రదేశ్, తైవాన్‌లను చైనాలో భాగంగా చూపకపోవడమే. ఈ మ్యాప్‌లలో అరుణాచల్‌ను ఇండియాలో భాగంగా, తైవాన్‌ను ప్రత్యేక దేశంగా చూపించారని చైనా ఆరోపించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను […]

మొన్న 30వేలు.. ఇప్పుడు 3లక్షల మ్యాప్‌లు ధ్వంసం చేసిన చైనా.. ఎందుకో తెలుసా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 02, 2019 | 9:38 PM

బీజింగ్ : చైనా కస్టమ్స్ అధికారులు మూడు లక్షల ప్రపంచ పటాలను ధ్వంసం చేయాలని ఆదేశించారు. వీటిని నెదర్లాండ్స్‌కు అక్రమంగా ఎగుమతి చేయాలని చూసిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గత నెలలోనూ చైనా ఇలాగే 30 వేల ప్రపంచ పటాలను ధ్వంసం చేసింది. దీనికి కారణం.. ఈ ప్రపంచ పటాల్లో అరుణాచల్‌ప్రదేశ్, తైవాన్‌లను చైనాలో భాగంగా చూపకపోవడమే. ఈ మ్యాప్‌లలో అరుణాచల్‌ను ఇండియాలో భాగంగా, తైవాన్‌ను ప్రత్యేక దేశంగా చూపించారని చైనా ఆరోపించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనా ఎప్పటి నుంచో దక్షిణ టిబెట్‌లో భాగంగా చూస్తున్నది. అరుణాచల్‌లో భారత్‌కు చెందిన నేతల పర్యటనలను కూడా చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అయితే ఇండియా మాత్రం అరుణాచల్ తమదేనని వాదిస్తూ.. మిగతా ప్రాంతాల్లాగే అక్కడా నేతలు పర్యటిస్తున్నారు. ఈ వివాదాస్పద సరిహద్దులపై ఇండియా, చైనా ఇప్పటికే 21 సార్లు చర్చలు జరిపినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఈ ప్రాంతాలను తమదిగా భావిస్తున్న చైనా.. అందుకు విరుద్ధంగా ఉన్న వరల్డ్ మ్యాప్‌లను ధ్వంసం చేస్తూ వస్తున్నది. తాజాగా అలాంటి 3 లక్షల మ్యాప్‌లను ధ్వంసం చేయాలని ఆదేశించింది.