సుజనా చౌదరికి ఈడీ షాక్.. రూ.315 కోట్ల ఆస్తులు అటాచ్

హైదరాబాద్ : ఎన్నికల ముంగిట టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో రూ.315 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని, వాటిని డొల్ల కంపెనీల ద్వారా తన సంస్థకు దారి మళ్లించినట్టు సుజనా గ్రూప్ మీద ఆరోపణలువచ్చాయి. దీనిపై గతంలో సీబీఐ విచారణ చేపట్జింది. అనంతరం ఆ విచారణను ఈడీకి బదిలీ చేసింది. కేసును విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుజనా గ్రూప్‌కి […]

సుజనా చౌదరికి ఈడీ షాక్.. రూ.315 కోట్ల ఆస్తులు అటాచ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 02, 2019 | 10:03 PM

హైదరాబాద్ : ఎన్నికల ముంగిట టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో రూ.315 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని, వాటిని డొల్ల కంపెనీల ద్వారా తన సంస్థకు దారి మళ్లించినట్టు సుజనా గ్రూప్ మీద ఆరోపణలువచ్చాయి. దీనిపై గతంలో సీబీఐ విచారణ చేపట్జింది. అనంతరం ఆ విచారణను ఈడీకి బదిలీ చేసింది. కేసును విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుజనా గ్రూప్‌కి సంబంధించిన రూ.315 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసింది. బీసీఈపీఎల్ కంపెనీ ద్వారా రూ.364 కోట్ల రుణం తీసుకున్నారని సుజనా చౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలోని ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. ఆ డబ్బులను బీసీఈపీఎల్ సంస్థ సుజనా చౌదరికి చెందిన డొల్ల కంపెనీలకు బదిలీ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ షెల్ కంపెనీల నుంచి వైశ్రాయ్ హోటల్స్, మహల్ హోటల్‌కు సుజనా గ్రూప్ బదిలీ చేసినట్టు సీబీఐ గుర్తించింది. ఈ కంపెనీ వ్యవహారాన్ని ఇప్పుడు ఈడీకి అప్పగించగా, రూ.315 కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ ఢిల్లీ చెన్నై బెంగళూరులోని ఆస్తులని ఈడీ అటాచ్ చేసింది.