AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుకు డబల్ షాక్.. రాజధానిపై జగన్ ఫోకస్

అధికారంలోకి రాగానే రాజధానిని అమరావతి నుంచి తరలించేస్తారంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబుకు వరుస పెట్టి షాకులిస్తోంది జగన్ సర్కార్. తాజాగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా టిడిపి అధినేత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చేవే. గత రెండు నెలలుగా రాజధానిని అమరావతినుంచి తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలపై పలు రకాల విశ్లేషణలు వచ్చాయి. అమరావతి నుంచి  రాజధానిని దొనకొండకు తరలిస్తారని ప్రచారం జరగడంతో దొనకొండలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో అక్కడ […]

చంద్రబాబుకు డబల్ షాక్.. రాజధానిపై జగన్ ఫోకస్
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 12, 2019 | 1:04 PM

Share

అధికారంలోకి రాగానే రాజధానిని అమరావతి నుంచి తరలించేస్తారంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబుకు వరుస పెట్టి షాకులిస్తోంది జగన్ సర్కార్. తాజాగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా టిడిపి అధినేత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చేవే. గత రెండు నెలలుగా రాజధానిని అమరావతినుంచి తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలపై పలు రకాల విశ్లేషణలు వచ్చాయి. అమరావతి నుంచి  రాజధానిని దొనకొండకు తరలిస్తారని ప్రచారం జరగడంతో దొనకొండలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో అక్కడ రాజధాని వస్తుందని భావించి భూములు కొన్న వారిలో చాలా మంది తాజా పరిణామాల నేపథ్యంలో అమ్మేసుకుని పెట్టుబడులు రాబట్టుకొన్నారు.

అయితే.. రాజధాని తరలింపు జరగబోదని తాజా పరిణామాలు చాటిచెబుతున్నాయి. అయితే.. మాస్టర్ ప్లాన్లో మాత్రం పెను మార్పులు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ఏపీ రాజధాని నిర్మాణానాకి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించే పనిలో పడింది జగన్ ప్రభుత్వం. చంద్రబాబు సుదీర్ఘ మంతనాల తర్వాత ఖరారు సింగపూర్ కన్సల్టెన్సీతో తయారు చేయించిన మాస్టర్ ప్లాన్ ని సమూలంగా మార్చాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో భారీ భవనాలు నిర్మించాలని గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో ప్రస్తావించగా.. ఇపుడు అందులో మార్పు తేవాలని నిర్ణయించారు.

అమరావతి పనులను మళ్ళీ చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించింన దరిమిలా.. కొత్త ప్రణాళికలు తయారు చేసే పనిలో పడ్డారు సీఆర్డిఏ అధికారులు. 25 అంతస్తుల భారీ భవనాలకు బదులుగా… 10 అంతస్తుల నిర్మాణాలు చేపట్టాలని తాజాగా నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో వుంచుకుని, మరీ గొప్పలకు పోకుండా రాజధాని నిర్మాణాలను చేపట్టాలన్న ముఖ్యమంత్రి అభిప్రాయం మేరకు ప్రతిపాదనల్లో మార్పులు చేస్తున్నారు. సచివాలయం కోసం అయిదు టవర్లు నిర్మించాలని గతంలో నిర్ణయించగా.. దాని బదులుగా రెండు పది అంతస్తుల టవర్లను నిర్మించాలని ప్రస్తుతం తలపెట్టారు.

2022 చివరి నాటికి రెండు టవర్లను పూర్తి చేసిన తర్వాత మిగితా టవర్లపై దృష్టి సారించాలని సీఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. మొదటి దశలో 3,132 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. వీటిలో ఇప్పటికే 332 కోటలు ఖర్చు కాగా.. మరో 2,800 కోట్ల వ్యయంతో 2022 నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని తలపెట్టారు.

భూముల లావాదేవాలపై సిఐడి నజర్..

అమరావతి ప్రాంతంలో మరీ ముఖ్యంగా తుళ్ళూరు ఏరియాలో జరిగిన, జరుగుతున్న భూ లావాదేవీలపై కూ జగన్ ప్రభుత్వం దృష్టి సారించడం టిడిపి నేతలకు షాకిచ్చే అంశంగానే పరిగణించారు. గత అయిదేళ్ళ కాలంలో ఇక్కడ జరిగిన భూ లావాదేవీలపై దర్యాప్తు జరిపేందుకు ఏపీ సీఐడి అధికారుల బృందం రంగంలోకి దిగింది.

ఒకవైపు చంద్రబాబు అమితంగా ఇష్టపడి తయారు చేయించిన రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు.. ఇంకోవైపు బాబు హయాంలో జరిగిన తుళ్ళూరు భూలావాదేవీలపై సిఐడి దర్యాప్తు.. వెరసి చంద్రబాబుకు వరుసగా షాకులు తగులుతున్నాయని ఏపీలో ప్రచారం జోరందుకుంది.