Breaking గూడ్స్‌ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్‌.. ఆంక్షల ఎత్తివేత

Breaking గూడ్స్‌ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్‌.. ఆంక్షల ఎత్తివేత

లాక్ డౌన్‌ని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. కొన్ని మినహాయింపులకు, కొన్ని ఆంక్షల ఎత్తివేతకు రెడీ అవుతోంది. అందులో భాగంగా కీలకమైన గూడ్స్ లారీలు, ఇతర వాహనాల రాకపోకలపై ఆంక్షలను ఎత్తి వేసింది.

Rajesh Sharma

|

Apr 13, 2020 | 12:48 PM

లాక్ డౌన్‌ని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. కొన్ని మినహాయింపులకు, కొన్ని ఆంక్షల ఎత్తివేతకు రెడీ అవుతోంది. అందులో భాగంగా కీలకమైన గూడ్స్ లారీలు, ఇతర వాహనాల రాకపోకలపై ఆంక్షలను ఎత్తి వేసింది. ఇకపై ఏరకమైన పాసులు అవసరం లేకుండానే గూడ్స్ వాహనాలు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణా చేసేలా ఆంక్షలను సడలించింది.

కా ప్రయాణికులను మాత్రం ఎక్కించుకునే వీల్లేకుండా చెకింగ్స్ కొనసాగుతాయి. ఖాళీగా తిరిగినా ఎవరు అభ్యంతరపెట్టరు కానీ మనుషులను ఎక్కించుకుంటే మాత్రం చర్యలు కఠినంగా వుంటాయని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు పలు రాష్ట్రాల పోలీసు బాసులకు సోమవారం ఉదయం సర్క్యులేట్ చేసింది.

కేంద్రం ఆదేశాలు అందడంతో తెలుగు రాష్ట్రాల్లో రవాణా లారీలు రోడ్డెక్కాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజాగా ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వటంతో లారీలు రోడ్లపైకి ప్రవేశిస్తున్నాయి. దీంతో తమ ఉత్పత్తులను రవాణా చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిశ్రమలు లారీల సప్లై ఆఫీసులకు ఫోన్లు చేసి బుకింగ్‌ చేసుకుంటున్నాయి.

దీంతో క్రమేణా లోడింగ్‌లు, అన్‌లోడింగ్‌లు పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పూర్తి నిర్మానుష్యంగా కనిపించిన జాతీయ రహదారులపై లారీలు పరుగులు పెట్టనున్నాయి. పాసులు ఇస్తే తప్ప రవాణా వాహనాలకు అనుమతి ఉండదన్న అపోహల కారణంతో చాలామంది బుకింగ్‌లు చేసుకోవటానికి వెనుకంజ వేశారు. దీంతో ఆశించినంతగా బుకింగ్‌లు జరగ లేదు.

మరోవైపు పాసులపై నెలకొన్ని అనుమానాలపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెరదించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులకు రవాణా వాహనాల అనుమతులకు సంబంధించి ఫ్యాక్స్‌/రేడియో మెసేజ్‌ను పంపారు. అన్ని రకాల గూడ్స్‌ వాహనాలను, ఖాళీగా ఉన్నవి అయినా సరే రోడ్ల మీద తిరిగేటపుడు పోలీసులు అడ్డుకోవద్దని సూచించారు. అలాగే, పాస్‌లు చూపించమని కూడా వాహనదారులను డిమాండ్‌ చేయొద్దని ఆదేశించారు. ఏ రకమైన గూడ్స్‌ రవాణా వాహనాల్లో అయినా కేవలం డ్రైవర్‌, క్లీనర్‌ మాత్రమే ఉండాలని, ప్రయాణికులను తరలించటాన్ని మాత్రం అనుమతించవద్దని పేర్కొన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu