హత్రాస్ జిల్లాకు వెళ్లనున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం హత్రాస్ జిల్లాకు వెళ్లనున్నారు. హత్యాచారానికి గురైన యువతి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ..

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం హత్రాస్ జిల్లాకు వెళ్లనున్నారు. హత్యాచారానికి గురైన యువతి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక నిన్న ఈ కుటుంబాన్ని ఓదార్చిన సంగతి విదితమే. హత్రాస్ ఘటనకు నిరసనగా ఈ నెల 2 న చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యాన భీమ్ ఆర్మీ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించింది. వందలాది కార్యకర్తలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని యూపీ ప్రభుత్వానికివ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేసేంతవరకు తమ ఆందోళన ఆగదని ప్రకటించారు. హత్రాస్ సంఘటన చాలా దారుణమైనదని, దుండగులు బాధితురాలిపై అత్యాచారం జరిపి, చిత్రవధ చేసి, ఎముకలు విరిచి ఆమెను హత్య చేశారని, ఇంత జరిగినా ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని చంద్రశేఖర్ ఆజాద్ నిప్పులు చెరిగారు.



