AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన దుండగులు

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని అతి పాశవికంగా యువతిని హతమార్చి గుంతలో పూడ్చిపెట్టారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన దుండగులు
Balaraju Goud
|

Updated on: Oct 04, 2020 | 11:11 AM

Share

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని అతి పాశవికంగా యువతిని హతమార్చి గుంతలో పూడ్చిపెట్టారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని కోట్‌పల్లి మండలంలోని అన్నసాగర్‌ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం మేకల కాపరులు తిరుగుతుండగా, వీధికుక్కలు పూడ్చిఉన్న ఓ మృతదేహాన్ని వెలికితీస్తున్నాయి. ఇది గమనించిన కాపరులు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న వికారాబాద్‌ పోలీసులు ఓ గోనెసంచిలో యువతి మృతదేహాన్ని ఉంచి దాని చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి గుంతలో పూడ్చినట్టు గుర్తించారు. రాత్రి 11.30 సమయంలో తవ్వి బయటకు తీసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమె హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వయసు 20 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటుందని, 4.5 అడుగుల ఎత్తు, శరీరంపై నైటీ, జాకెట్‌, ఎడమ చేతికి ఆకుపచ్చ గాజు, ఎడమ కాలికి పట్టీ, మెడలో రోల్డ్‌గోల్డ్‌ గొలుసు ఉన్నాయని పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు తెలిపారు.

మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?