ఏపీ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ‘కీ’ మరోసారి విడుదల !
టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ నెల 26న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ‘కీ’ ఉపసంహరించుకున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మళ్లీ ‘కీ’ ని అప్‌లోడ్ చేస్తామని తెలిపింది.
టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ నెల 26న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ‘కీ’ ఉపసంహరించుకున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మళ్లీ ‘కీ’ ని అప్‌లోడ్ చేస్తామని తెలిపింది. అభ్యంతరాలు తెలిపేందుకు మూడు రోజులు గడువు ఇచ్చింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Due to technical reasons, Secretary APPSC has withdrawn the initial key published on 26/9/2020. The key will be uploaded again shortly and the Candidates will be given three days time to raise objections if any. Secretary APPSC is deeply regretful for the Inconvenience caused. pic.twitter.com/1qX9EfSqBi
— Gopal Krishna Dwivedi (@gkd600) September 28, 2020
సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ప్రాథమిక ‘కీ’ని అధికారులు తొలుత శనివారం రాత్రి రిలీజ్ చేశారు. మొత్తం 14 రకాల రాతపరీక్షలకు సంబంధించిన కీ వివరాలను గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్క పరీక్షకు నాలుగు రకాల టెస్ట్ బుక్‌లెట్ సిరీస్ కోడ్ వారీగా కీలను రిలీజ్ చేశారు. మొత్తం 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ నెల 20వ తేదీ మొదలైన రాతపరీక్షలు శనివారం సాయంత్రం కంప్లీట్ అయ్యాయి. ఈ ఎగ్జామ్స్ కు 72.73 మంది అభ్యర్ధులు హాజరైనట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అయితే టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ నెల 26న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ‘కీ’ ఉపసంహరించుకున్నారు.