ఏపీ సీఈవో ఎదుటే మొరాయించిన ఈవీఎం
అమరావతి: ఎన్నికల వేళ సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి ముందే ఈవీఎం మొరాయించింది. ఓటు వేసేందుకు ఆయన తాడేపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా.. వీవీ ప్యాట్ మొరాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొరాయించిన ఈవీఎంలను బాగుచేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సాయంత్రం 6గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారందరికీ ఓటు వేసేందుకు వీలు కల్పిస్తామని ఆయన అన్నారు.