ఏపీకి త్వరలోనే రైల్వే జోన్: కన్నా లక్ష్మీనారాయణ

ఢిల్లీ: ఏపీకి త్వరలోనే రైల్వే జోన్ వస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఢిల్లీలో శనివారం రైల్వేమంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. రైల్వే జోన్‌ ఆవశ్యకతను పీయూష్‌ గోయల్‌కు వివరించామన్నారు. 2014 నుంచి కేంద్రం ఏపీ అభివృద్ధికి సహకరిస్తోందని… అయినా చంద్రబాబు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే […]

ఏపీకి త్వరలోనే రైల్వే జోన్: కన్నా లక్ష్మీనారాయణ
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:07 PM

ఢిల్లీ: ఏపీకి త్వరలోనే రైల్వే జోన్ వస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఢిల్లీలో శనివారం రైల్వేమంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. రైల్వే జోన్‌ ఆవశ్యకతను పీయూష్‌ గోయల్‌కు వివరించామన్నారు. 2014 నుంచి కేంద్రం ఏపీ అభివృద్ధికి సహకరిస్తోందని… అయినా చంద్రబాబు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కన్నా విమర్శించారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు కేంద్రం ఏపీకి ఇచ్చిందని, విభజన హామీలను కేంద్రం 90 శాతం అమలు చేసిందన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం అడ్డుపడుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని కన్నా ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం 100 శాతం నిధులు ఇస్తోందన్నారు.