Amit Shah and Pawankalyan: ఒకే వేదికపై అమిత్‌షా, పవన్ కల్యాణ్
బీజేపీతో జతకట్టిన తర్వాత తొలిసారి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసి వేదిక పంచుకోబోతున్నారు పవన్ కల్యాణ్.
Amit Shah and Pawankalyan to share dias for the first time: కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూగా భావిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఒకే అంశంపై రెండు పార్టీల ఉమ్మడి అభిప్రాయాన్ని వెల్లడించబోతున్నారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులు చొరవ తీసుకుని మరీ ఏర్పాట్లును ముమ్మరం చేశాయి.
భారతీయ పౌరసత్వ నిబంధలను సవరించినప్పట్నించీ దేశంలో ముస్లింల అప్పీస్‌మెంట్ పెరిగిపోవడం.. కేంద్ర ప్రభుత్వం అసలు ఉద్దేశాన్ని వక్రీకరించం పెచ్చుమీరిపోతుందని భావిస్తున్న బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు అనుకూలంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి సైతం తాను పాల్గొంటున్న ప్రతీ కార్యక్రమంలో సీఏఏని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ వైఖరి స్పష్టంగా వుందని ప్రకటిస్తూనే వున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహించాలని తలపెట్టారు. ఇందుకో నగరం నడిబొడ్డున వున్న ఎల్బీ స్టేడియంను ఎంపిక చేసుకున్నారు. మార్చి నెల 14వతేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా అమిత్‌షా హజరు కానుండగా.. మిత్ర పక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరో విశిష్ట అతిథిగా హాజరవుతున్నట్లు సమాచారం.
Also read: YCP finalized 3 Rajyasabha candidates names, What about 4th?
జనవరి మూడోవారంలో రెండు పార్టీలు (బీజేపీ, జనసేన) మధ్య స్నేహం కుదిరి, సంయుక్త ప్రకటన చేసినా.. ఇంత వరకు ఉమ్మడి కార్యక్రమాలేవీ నిర్వహించలేదు. ఇటీవలి రాజధాని పర్యటనలోను పవన్ కల్యాణ్ సింగిల్‌గానే ముందుకు వెళ్ళారు. మరోవైపు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీ నేతలు సోమవారం గుంటూరులో వేరుగానే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాజధాని అంశంపై లాంగ్ మార్చ్ నిర్వహిస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ దానికి బీజేపీ నేతల సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోగా తెలంగాణ నేతల కార్యచరణ ముందుకు రావడంతో మార్చి 14న జరిగే భారీ బహిరంగ సభకు పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. జాతీయత అంశం కావడంతో పవన్ కల్యాణ్ దానికి వెంటనే ఒకే చెప్పారని అనుకుంటున్నారు.
మార్చి పద్నాలుగో తేదీకంటే ముందుగా జనసేన పార్టీ రాజధాని అంశంపై లాంగ్ మార్చ్ నిర్వహిస్తే.. దానికి బీజేపీ నేతలు హాజరవుతారా అన్నదింకా తేలకపోవడంతో.. హైదరాబాద్‌లో జరిగే బీజేపీ, జనసేన మొదటి ఉమ్మడి కార్యక్రమం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా లాంగ్ మార్చి జరిగి.. బీజేపీ దానికి హాజరైతే.. అదే రెండు పార్టీల మొదటి ఉమ్మడి కార్యక్రమం అవుతుంది. ఏది తొలి కార్యక్రమం అన్నది త్వరలోనే తేలనుంది.