Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • తెలంగాణ బీజేపీ కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్. కార్యాలయాన్ని సోమవారం వరకు మూసి ఉంచాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం. జాతీయ పార్టీ కీలక నేతలు కరోనా బారిన పడటంతో రాష్ట్ర కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించ కూడదని నిర్ణయం.
  • అమరావతి : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం. 3రాజధాని అంశంపై హైకోర్టు విచారణ. రాజధాని తరలింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు. గవర్నర్ గెజిట్ పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్ట్.
  • రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిన హైకోర్టు. 10 రోజులపాటు స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతున్న హైకోర్టు. రెండు బిల్లులకు సంబంధించి ఇదివరకే గెజిట్‌ విడుదల. తదుపరి కార్యకలాపాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు.
  • సింగ‌ర్ స్మిత‌కు కోవిడ్ పాజిటివ్‌: పాప్ సింగ‌ర్ స్మిత‌కు కోవిడ్ పాజిటివ్‌. కోవిడ్్ ల‌క్ష‌ణాలు లేవ‌ని ట్వీట్‌. ఒళ్లు నొప్పులు ఉండ‌టంతో ఎందుకైనా మంచిద‌ని ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్టు వెల్ల‌డి. ఇంట్లో సేఫ్‌గానే ఉన్న‌ప్ప‌టికీ త‌మ‌కు క‌రోనా సోకింద‌న్న స్మిత‌. త్వ‌ర‌లో క‌రోనాను జ‌యించి ప్లాస్మా దానం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ట్వీట్.
  • ఇవాళ యూపీఎస్సీ సివిల్స్-2019 ఫలితాలు వెలువడ్డాయి. సిద్ధిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించాడు. మొత్తం 829 మంది సివిల్ సర్వీసులకు ఎంపికవగా, మకరంద్ మెరుగైన ర్యాంక్ అందుకున్నాడు. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన సిద్ధిపేట బిడ్డ మంద మకరంద్ కు హార్దిక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని దేశ స్థాయిలో నిలిపాడంటూ మకరంద్ ను అభినందించారు.
  • మరో మూడు కార్పొరేట్‌ ఆస్పత్రులకు కోవిడ్ సేవలు కట్...! హైదరాబాద్ లో కరోనా ట్రీట్ మెంట్ చేస్తున్న మరికొన్ని ఆస్పత్రులకు ఆరోగ్య నోటీసులు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం యాక్షన్ .

YCP RS Candidates: రాజ్యసభ బెర్తులు ఖరారు.. మరి నాలుగోది?

మార్చినెలలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులకు జగన్ ఖరారు చేశారు. అయితే, నాలుగో వ్యక్తిని ఎంపిక చేయకపోవడంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ycp rajyasabha candidates finalized, YCP RS Candidates: రాజ్యసభ బెర్తులు ఖరారు.. మరి నాలుగోది?

Jagan finalised YCP Rajyasabha candidates: మార్చిలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పెద్దల సభకు పంపే నేతల పేర్లను వైసీపీ అధినేత జగన్ ఇదివరకే ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఇద్దరు రాజకీయ నాయకులుగా మారిన పారిశ్రామికవేత్తలని, మరొకరు జగన్‌కు అత్యంత విధేయుడైన మంత్రి అని తెలుస్తోంది. అయితే.. మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండగా.. కేవలం ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయడం వెనుక వ్యూయహమేంటన్న చర్చ కూడా జోరందుకుంది.

ప్రస్తుతం జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఈసారి మార్చిలో ఏపీలో నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటిలో నాలిగింటికి నాలుగు మొత్తం వైసీపీకే దక్కే ఛాన్స్ వుంది. కానీ.. వైసీపీ తాజాగా ముగ్గురు పేర్లను మాత్రమే ఖరారు చేయడంతో నాలుగో సీటుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. దాన్ని ఎవరికి కేటాయిస్తారు? అనేది ఆసక్తిగా మారింది.

తాజాగా బీజేపీకి వైసీపీ దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నందున బీజేపీ కోరిన వ్యక్తిని నాలుగో ఎంపీగా రాజ్యసభకు పంపుతారని చర్చ జరుగుతోంది. అదే సమయంలో సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని రాజ్యసభకు పంపాలని జగన్ భావిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరి బీజేపీకి ఇస్తారా లేక నాలుగో సీటును వైసీపీ కోటాలోనే చిరంజీవిని పంపుతారా అన్నది వేచి చూడాల్సిన అసవరం వుంది.

కాగా.. ఇప్పుడుకి ఖరారైన పేర్లను పరిశీలిస్తే వారిలో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వ్యవస్థాపకులు. క్రియాశీ రాజకీయాలకు వచ్చే వరకు ఆయన రాంకీ చైర్మెన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం స్మిలాక్స్, ట్రాడాక్స్, ఆర్.వాక్ సంస్థల్లో బోర్డు మెంబర్‌గా కొనసాగుతున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన అయోధ్యరామిరెడ్డి.. గతంలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా వున్న అయోధ్య రామిరెడ్డిని త్వరలో రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. ఫిబ్రవరి 2న అయోధ్యరామిరెడ్డి తనయుని వివాహానికి జగన్ స్వయంగా హాజరు కావడంతో ఆయనకిస్తున్న ప్రాధాన్యతను చాటుతోందని చెప్పుకుంటున్నారు.

Also read: Pawan Kalyan to share dias with Amith Shah soon

ఇక ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న నెల్లూరు జిల్లా సీనియర్ నేత బీదా మస్తాన్ రావును రెండో అభ్యర్థిగా జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి ఆయన వైసీపీలో చేరారు. పార్టీకి కొత్తే అయినా.. వైసీపీ ఎంపీ, సీనియర్ నేత విజయసాయిరెడ్డికి బీదా అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. బీదా, విజయసాయి తొలి నాళ్ళలో కొలీగ్స్ కావడమే వారిద్దరి సాన్నిహిత్యానికి కారణమని చెప్పుకుంటున్నారు. బీసీ వర్గానికి చెందిన బీదా మస్తాన్ రావు అభ్యర్థిత్వం ఆల్‌రెడీ కన్‌ఫర్మ్ అయిందని తెలుస్తోంది.

జగన్‌కు అత్యంత సిన్నిహితుడైన మోపిదేవి వెంకటరమణకు మూడో టిక్కెట్ లభిస్తుందని చెప్పుకుంటున్నారు. ఈయన మత్స్యకార కుటుంబానికి చెందిన వారు. గతంలో జగన్‌తో పాటు అవినీతి ఆరోపణలతో వాన్‌పిక్ కేసులో జైలు శిక్ష అనుభవించారు. జగన్ లాయలిస్టుల జాబితాలో తొలి నాలుగైదు పేర్లలో మోపిదేవి పేరు చెప్పుకుంటుంటారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోపిదేవిని జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే.. తాజాగా ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో మోపిదేవిని రాజ్యసభకు తప్పక పంపాల్సి అవసరం కనిపిస్తోంది. ఆమేరకు మోపిదేవి వెంకటరమణ పేరును రాజ్యసభకు మూడో అభ్యర్థిగా ఖరారు చేశారని అంటున్నారు.

ఇక మిగిలిన నాలుగో సీటు విషయంలోనే పెద్ద చర్చ జరుగుతోంది. జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Related Tags