‘ఉల్లి’ కన్నీరు తగ్గకముందే..ట‘మోత’!
ఆకాశాన్నంటిన ఉల్లిధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఎగుమతులపై కేంద్ర నిషేధం విధించడం, అక్రమంగా నిల్వలు ఉంచి కొరతను సృష్టించేవారిపై చర్యలు తీసుకోవడంతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఉల్లిధర హోల్‌సేల్ మార్కెట్‌లో రూ. 30 నడుస్తుంది. ఇక టామోట ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాకాలంలోనూ ఏ మాత్రం దిగిరావడం లేదు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగానే ధరలు పెరిగాయని పేర్కొంటున్నారు. భారత్ వంటి దేశాల్లో టమోటా ధరలు వాతావరణ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటాయన్న […]
ఆకాశాన్నంటిన ఉల్లిధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఎగుమతులపై కేంద్ర నిషేధం విధించడం, అక్రమంగా నిల్వలు ఉంచి కొరతను సృష్టించేవారిపై చర్యలు తీసుకోవడంతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఉల్లిధర హోల్‌సేల్ మార్కెట్‌లో రూ. 30 నడుస్తుంది. ఇక టామోట ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాకాలంలోనూ ఏ మాత్రం దిగిరావడం లేదు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగానే ధరలు పెరిగాయని పేర్కొంటున్నారు. భారత్ వంటి దేశాల్లో టమోటా ధరలు వాతావరణ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటాయన్న విషయం తెలిసిందే. 15 రోజుల క్రితం రూ.20 నుంచి రూ.30 మధ్య ఉన్న ధరలు, వారంరోజుల్లోనే రూ. 40కి ఎగబాకాయి. తాజాగా దేశవ్యాప్తంగా రూ. 80 వరకు టమాట ధర నడుస్తోంది. నవరాత్రుల సీజన్ కావడంతో ఉల్లిధర తగ్గింది..అనూహ్యంగా టమోటా వాడకం పెరిగింది. కాగా ఈ ధరలు దీపావళి వరకు ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టమోటాను ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు కర్ణాటకలలోను ఎక్కువగా పండిస్తారు. వరదలు, వర్షాలు ఈ ప్రాంతాల్లో పంటలను నాశనం చేశాయి. అంతేకాదు విపరీతంగా కాసిన కాపు కూడా తేమ కారణంగా త్వరగా కుళ్లిపోతున్నాయి. ఈ కారణాలతో ఢిల్లీతో సహా దేశంలోని అనేక నగరాల్లో ధరలు భగ్గుమంటున్నాయి. దిగుమతులు లేకపోవడంతో హోల్‌సేల్ మార్కెట్లు ధరల పెరుగుదలను చూస్తున్నాయి.
ఇక పప్పుదినుసుల ధరలు కూడా భారీగానే పెరిగాయి. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది చాలా తక్కువ పప్పు దినుసుల దిగుబడి నమోదైంది. అయితే, సరుకు నిల్వల మీద ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడం, నిబంధనలు అమలు చేయడంతో ఒక్క రోజు కొంచెం ధరలు తగ్గినా…మళ్లీ యధావిధిగా పెరుగుదల నమోదవుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముంబైలో మంగళవారం క్వింటా మినప్పప్పు ధర రూ. 5450 (గత వారంతో పోలిస్తే రూ.550 అధికం). ఢిల్లీలో రూ.450, చెన్నైలో రూ.600, కోల్‌కతాలో రూ.800 వరకు ధరలు పెరిగాయి. పెసరపప్పు కూడా వివిధ నగరాల్లో కనీసం రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగాయి.