చిదంబరానికి కడుపు నొప్పి.. ఎయిమ్స్‌కు తరలింపు!!

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో భాగంగా.. కాంగ్రెస్ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీహార్‌ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా.. ఉన్నట్టుండి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. శనివారం తీవ్రమైన కడుపునొప్పితో.. బాధపడుతుంగా.. జైలు అధికారులు చిదంబరాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని మళ్లీ తిరిగి జైలుకు తరలించినట్లు అధికారులు తెలియజేశారు. కాగా.. జైలులోని ఫుడ్ కారణంగా.. ఆయన ఇప్పటికే 4 కేజీల బరువు తగ్గారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన […]

చిదంబరానికి కడుపు నొప్పి.. ఎయిమ్స్‌కు తరలింపు!!
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 9:00 AM

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో భాగంగా.. కాంగ్రెస్ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీహార్‌ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా.. ఉన్నట్టుండి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. శనివారం తీవ్రమైన కడుపునొప్పితో.. బాధపడుతుంగా.. జైలు అధికారులు చిదంబరాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని మళ్లీ తిరిగి జైలుకు తరలించినట్లు అధికారులు తెలియజేశారు.

కాగా.. జైలులోని ఫుడ్ కారణంగా.. ఆయన ఇప్పటికే 4 కేజీల బరువు తగ్గారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన చిదంబరానికి జుడీషియల్ కస్టడీనీ విధించింది కోర్టు. ఈ శిక్ష అక్టోబర్ 17 వరకూ పొడగిస్తూ.. ఢిల్లీ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణలో భాగంగా.. సీబీఐ అభ్యర్థన మేరకు ఈ తీర్పును చెప్పింది కోర్టు.

2004-2014 మధ్య చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపు రూ.305 కోట్ల విదేశీ నిధులను.. అక్రమంగా పొందినట్లు ఆరోపణలతో 2017 మే 15న ఆయనపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2019, ఆగష్టు 21న ఆరెస్ట్ అయ్యారు.