ఆర్టీసీ స్ట్రైక్: ఓ పోలీస్ ఏంచేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
వరంగల్ జిల్లా గూడూరులో ఓ కానిస్టేబుల్ కండక్టర్ అవతారమెత్తాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తుండడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. పండగవేళ ప్రయాణికుల ఇబ్బందులు చూసి ఓ కానిస్టేబుల్ కండక్టర్‌గా విధులు నిర్వహించాడు. పోలీస్ వాహనాలు ఎస్కార్టుగా ముందు వెళ్తూ మహబూబాబాద్, వరంగల్, భద్రాచలం, కరీనగర్, వేములవాడ, గోదావరిఖని వంటి ప్రాంతాలకు బస్సులను పంపుతున్నారు. డీఎస్సీ నరేష్ ఆధ్వర్యంలో సీఐ బాలాజీ నాయక్ పర్యవేక్షణలో మరిన్ని బస్సులు తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. అక్టోబర్ 5 నుంచి […]
వరంగల్ జిల్లా గూడూరులో ఓ కానిస్టేబుల్ కండక్టర్ అవతారమెత్తాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తుండడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. పండగవేళ ప్రయాణికుల ఇబ్బందులు చూసి ఓ కానిస్టేబుల్ కండక్టర్‌గా విధులు నిర్వహించాడు. పోలీస్ వాహనాలు ఎస్కార్టుగా ముందు వెళ్తూ మహబూబాబాద్, వరంగల్, భద్రాచలం, కరీనగర్, వేములవాడ, గోదావరిఖని వంటి ప్రాంతాలకు బస్సులను పంపుతున్నారు. డీఎస్సీ నరేష్ ఆధ్వర్యంలో సీఐ బాలాజీ నాయక్ పర్యవేక్షణలో మరిన్ని బస్సులు తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా.. అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెను చేపట్టారు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో.. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. అసలే ఇప్పుడు పండగ సీజన్ కావడంతో.. నగరవాసులంతా.. పల్లెల బాట పడుతున్నారు. ఇప్పుడు వీరిని అడ్డంగా దోచేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. దీంతో.. మేము ఇంకెలా పండగ చేసుకుంటామని.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.