పాక్, చైనాల మధ్య విమానాలు బంద్

బీజింగ్: పాకిస్థాన్, చైనాల మధ్య విమాన సర్వీసులు బందయ్యాయి. భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ తన ఆకాశ మార్గాన్ని మూసివేసింది. దీని ఫలితంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చైనా తప్పనిసరిగా చైనా నుంచి పాక్‌కు, పాక్ నుంచి చైనాకు రాకపోకలు జరిపే విమానాలను తాత్కాళికంగా నిలిపివేసింది. ఒక్క చైనానే కాదు పాకిస్తాన్ గగనతలం మీదగా రాకపోకలు జరిపే పలు విమాన సర్వీసులు ప్రభావితం అయ్యాయి. కొన్ని దేశాల విమానాలు తమ గగనతలాన్ని […]

పాక్, చైనాల మధ్య విమానాలు బంద్
Follow us

|

Updated on: Mar 01, 2019 | 4:19 PM

బీజింగ్: పాకిస్థాన్, చైనాల మధ్య విమాన సర్వీసులు బందయ్యాయి. భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ తన ఆకాశ మార్గాన్ని మూసివేసింది. దీని ఫలితంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చైనా తప్పనిసరిగా చైనా నుంచి పాక్‌కు, పాక్ నుంచి చైనాకు రాకపోకలు జరిపే విమానాలను తాత్కాళికంగా నిలిపివేసింది.

ఒక్క చైనానే కాదు పాకిస్తాన్ గగనతలం మీదగా రాకపోకలు జరిపే పలు విమాన సర్వీసులు ప్రభావితం అయ్యాయి. కొన్ని దేశాల విమానాలు తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు చైనా అంగీకరించింది. ఈ క్రమంలోనే భారత్-పాకిస్తాన్‌లు ఉద్రిక్త పరిస్థితులకు చెక్ పెట్టాలని చైనా సూచించింది.