వీటిని తిన్న వెంటనే మంచి నీళ్ళను తాగుతున్నారా? అయితే, ఇది మీ కోసమే!
ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతాము. అలా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. మనకి పడని ఫుడ్స్ తిని కొత్త సమస్యలు తెచ్చుకోకండి. అయితే.. వీటిని తిన్నతర్వాత నీరు తాగడం అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు వెల్లడించారు.

మనం ఎంత ఆహారం తిన్నా కూడా మన శరీరం నీటిని మాత్రమే కోరుకుంటుంది. ఇంకా చెప్పాలంటే మనిషి శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. ఆహార పదార్ధాలు ఎంత ముఖ్యమో అంతకి మించి నీరు కూడా అంతే అవసరం. కాబట్టి ఎవరైనా సరే శరీరానికి సరిపడా నీరు తీసుకుంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాదు, మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు కూడా సరైనవిగా ఉండాలి. వాటిని తీసుకుని సరిపడా నీరును తాగకపోతే జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మనకి పడని ఫుడ్స్ తిని కొత్త సమస్యలు తెచ్చుకోకండి. మరి, అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
శెనగలు
శెనగలు చాలా మంది తింటుంటారు. ఎందుకంటే, వీటిలో పోషకాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వీటిలో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వలన అవి తొందరగా జీర్ణం కావు. కాబట్టి, తిన్న వెంటనే నీటిని తాగకండి. శెనగలు తిన్న గంట తర్వాత మంచి నీళ్ళను తాగండి.
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత నీళ్ళను తాగితే జీర్ణక్రియ పని తీరు మందగిస్తుంది. దీని వలన ఎంజైములు పని చేయకుండా అవుతాయి. ఆ తర్వాత కడుపు భారంగా అనిపిస్తుంది. కాబట్టి, కనీసం ఒక గంట విరామం ఇచ్చి నీరు తాగితే చాలా మంచిది.
నిమ్మ, ద్రాక్ష పండ్లు
నిమ్మ, ద్రాక్ష, నారింజ వంటి పండ్లు పొట్ట సమస్యలకు దారి తీస్తాయి. వీటిని తిన్న తర్వాత వెంటనే నీరు తాగకూడదు. అలా చేస్తే కడుపులో గ్యాస్ ఎక్కువయ్యి వాంతులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అస్సలు తాగకండి. అందుకే వీటిని తిన్న తర్వాత గంట పాటు నీరు తాగొద్దు.
బొప్పాయి
బొప్పాయిలో విటమిన్ ఏ, సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది కానీ దీనిని తిన్న వెంటనే వాటర్ ను తాగితే కడుపు ఉబ్బరంతో పొట్ట సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి బొప్పాయిని తిన్న తర్వాత రెండు గంటల తర్వాత నీటిని తాగండి.
పాలు
పచ్చి పాలు అందరికీ జీర్ణం కావు పొట్టలో ఇబ్బంది స్టార్ట్ అయ్యి ఏం చేయాలో తెలియక వెంటనే నీళ్ళను తాగుతారు. ఇలా చేయకండి. దీని వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువుతాయి. రోజంతా విరోచనాలు అవుతూనే ఉంటాయి. కాబట్టి పాలు తాగిన తర్వాత రెండు గంటలు గ్యాప్ ఇచ్చి మంచి నీళ్ళను తీసుకోండి.