హేమంత్ మర్డర్ కేసులో మినిట్ టు మినిట్ ట్రావెల్ హిస్టరీ
హేమంత్ తో ప్రేమపెళ్లి గిట్టని అవంతి కుటుంబ సభ్యులు పరువు హత్యకు పాల్పడ్డ నేపథ్యంలో కేసు విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని.. ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు మరింత సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ట్రావెల్ హిస్టరీ పోలీసులకు ఉపయుక్తంగా మారింది. ఇవాళ హేమంత్ అంత్యక్రియలు పూర్తయిన వేళ కేసును మరింత ముందుకు తీసుకెళ్లేలా పోలీసులు చకచకా దర్యాప్తు సాగిస్తున్నారు. చందా నగర్ లోని […]
హేమంత్ తో ప్రేమపెళ్లి గిట్టని అవంతి కుటుంబ సభ్యులు పరువు హత్యకు పాల్పడ్డ నేపథ్యంలో కేసు విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని.. ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు మరింత సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ట్రావెల్ హిస్టరీ పోలీసులకు ఉపయుక్తంగా మారింది. ఇవాళ హేమంత్ అంత్యక్రియలు పూర్తయిన వేళ కేసును మరింత ముందుకు తీసుకెళ్లేలా పోలీసులు చకచకా దర్యాప్తు సాగిస్తున్నారు. చందా నగర్ లోని అవంతి ఇంటి దగ్గర నుంచి.. హత్య చేసి హైదరాబాద్ కు వచ్చే వరకు ట్రావెల్ హిస్టరీ కీలకంగా మారింది. ఇప్పటికే నిందితుల ట్రావెల్ హిస్టరీపై పూర్తిస్థాయి సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఆ సమాచారం మినిట్ టు మినిట్..
> చందా నగర్ లోని లక్ష్మారెడ్డి ఇంటి నుంచి మూడు కార్లలో బయల్దేరిన నిందితులు.
> అవంతి తండ్రి లక్ష్మారెడ్డి హోండా షైన్ వెహికల్ పై బయలుదేరిన వైనం.
> రెండు గంటల నలభై నిమిషాలకి చందానగర్ నుంచి బయలుదేరిన నిందితులు.
> 40 నిమిషాలు ట్రావెల్ చేసి గచ్చిబౌలిలోని అవంతి ఇంటికి చేరుకున్న నిందితులు.
> ఇంట్లో ఉన్న అవంతి, హేమంత్ లను బలవంతంగా కారులో ఎక్కించుకున్న నిందితులు.
> అవంతి హేమంత్ లను వేరే వేరే కార్లలో ఎక్కించుకున్న నిందితులు.
> 15 నిమిషాల్లో గోపనపల్లి చౌరస్తా కు చేరుకున్న నిందితులు.
> గోపన్ పల్లి చౌరస్తాలో అవంతిని కిందకు దింపి వేసిన నిందితులు.
> హేమంత్ తో మాట్లాడి పంపిస్తాను అంటూ కారులో తీసుకెళ్లిన యుగంధర్..
> యుగంధర్ తో పాటు అప్పటికే కార్ లో ఉన్న కిరాయి హంతకులు.
> యాదవ్, రాజు, పాష, యుగంధర్ లు కలిసి ఒకే కారులో సంగారెడ్డికి వైపు పయనం..
> కొంత దూరం వెళ్ళిన తర్వాత అవంతినీ కిందికి దించి వేసిన యుగంధర్
> గోపనపల్లి నుంచి డ్రైవ్ చేసుకుంటూ జహీరాబాద్ వరకు వెళ్లిన యుగంధర్.
> హేమంత్ ను పలుమార్లు బెదిరించిన కిరాయి హంతకులు.
> అవంతి ని వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డ కిరాయి హంతకులు.
> అవంతిని వదిలి పెట్టేందుకు ఇష్టపడని హేమంత్.
> జహీరాబాద్ వద్ద మద్యంతో పాటు తాళ్లు తీసుకున్న యుగంధర్..
> 7:30 కు సంగారెడ్డి సమీపానికి చేరుకున్న యుగంధర్.
> కారులోనే హేమంత్ కాళ్లు చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసిన కిరాయి హంతకులు.
> 7:30 ప్రాంతంలో ప్రేమ ఎందుకంటూ ఉరివేసి చంపేసిన యుగంధర్.
> తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ముత్తంగి సమీపంలోని దేవాలయం వద్దకు చేరుకున్న యుగంధర్.
> టెంపుల్ వద్ద మద్యం సేవింపు.
> 1:30 కు సంగారెడ్డిలోని మిత్రుల దగ్గర భోజనం చేసిన కిరాయి హంతకులు.. యుగంధర్
> 2:30 కు పోలీసులకు చిక్కిన యుగంధర్.