కశ్మీర్ చరిత్రలో నవశకం ఆరంభమైంది : ప్రధాని మోదీ

కశ్మీర్ చరిత్రలో నవశకం ఆరంభమైంది : ప్రధాని మోదీ

ఆర్టికల్ 370 వల్ల ఇప్పటివరకు ఏ  ఒక్కరికీ న్యాయం జరగలేదని . ఇప్పటి వరకు   42,000 మంది అమాయకులు చనిపోయారని… పిల్లలు చదువుకు దూరమయ్యారని వ్యాఖ్యానించారు.  కశ్మీర్ చరిత్రలో మరో నవశకం ప్రారంభమైందని ప్రధాని మోదీ తెలిపారు.  కాశ్మీర్ లోని కోటి మంది ప్రజలకు తప్పకుండ న్యాయం చేస్తామని . మేం చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని తొలిసారి జమ్ము కశ్మీర్ ప్రజలనుద్దేశించి దాదాపు 30 నిమిషాలసేపు ప్రసంగించారు. ఇకనుంచి కశ్మీర్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 09, 2019 | 12:35 PM

ఆర్టికల్ 370 వల్ల ఇప్పటివరకు ఏ  ఒక్కరికీ న్యాయం జరగలేదని . ఇప్పటి వరకు   42,000 మంది అమాయకులు చనిపోయారని… పిల్లలు చదువుకు దూరమయ్యారని వ్యాఖ్యానించారు.  కశ్మీర్ చరిత్రలో మరో నవశకం ప్రారంభమైందని ప్రధాని మోదీ తెలిపారు.  కాశ్మీర్ లోని కోటి మంది ప్రజలకు తప్పకుండ న్యాయం చేస్తామని . మేం చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని తొలిసారి జమ్ము కశ్మీర్ ప్రజలనుద్దేశించి దాదాపు 30 నిమిషాలసేపు ప్రసంగించారు.

ఇకనుంచి కశ్మీర్ ప్రజలు, యువత ధైర్యంగా జీవించవచ్చని, జనం జీవితాలు మారడానికి, రాష్ట్రం  అభివృద్ది చెందడానికి ఇంతకంటే ఏం కావాలి అన్నారు మోదీ. నాపై విశ్వాసముంచండి. ఖచ్చితంగా భవిష్యత్తు మారబోతుందని జమ్ము కశ్మీర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఉగ్రవాదం నుంచి విముక్తి కల్పించేందుకు మేమున్నామని, ఎవ్వరూ భయపడాల్సి అవసరం లేదన్నారు ప్రధాని. కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్ ఎక్కవకాలం ఉండబోదని, పరిస్థితులన్నీ సర్దుకున్న తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రంగా మారబోతుందని తెలిపారు.

ఇంతకాలం ఆర్టికల్ 370ని ఆసరాగా చేసుకుని అవినీతి, కుటుంబపాలన రాజ్యమేలిందని ఇక ఇక్కడ అభివృద్దికి అన్ని అడ్డులు తొలగిపోాయాయన్నారు మోదీ.ఇంతకాలం ఇక్కడ పిల్లలు చదువుకు దూరమయ్యారని, పాకిస్తాన్ కూడా ఆర్టికల్ 370ని ఓ ఆయుధంలా వాడుకుందన్నారు ప్రధాని. కేంద్ర పాలిత ప్రాంత ఉద్యోగులకు లభించే అన్ని వసతులు ఇక్కడి ఉద్యోగులకు లభిస్తాయన్నారు. ఒకటే దేశం, ఒకటే రాజ్యంగం కల ఈనాటికి నెరవేరిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu