మాపై ఎలాంటి ఒత్తిడి లేదు- పాకిస్థాన్

ఇస్లామాబాద్‌: భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్థాన్‌ శుక్రవారం తిగిరి భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఆయనను విడుదల చేయడం వెనుక తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌‌ ఖురేషి చెప్పుకొచ్చారు. అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్‌, రష్యా, యూకే వంటి దేశాల ఒత్తిడి వల్లే భారత పైలట్‌ను పాక్‌ విడుదల చేసిందని వార్తలు వినపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘మీ (భారత) బాధను పెంచాలని మేము అనుకోలేదు. మేము శాంతిని కోరుకుంటున్నాము. పాక్‌ ప్రభుత్వం.. దేశంలో, ఇతర భూభాగాల్లో శాంతికి విఘాతం కలిగించే అసాంఘిక కార్యకలాపాలకు […]

మాపై ఎలాంటి ఒత్తిడి లేదు- పాకిస్థాన్
Follow us

|

Updated on: Mar 02, 2019 | 6:32 PM

ఇస్లామాబాద్‌: భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్థాన్‌ శుక్రవారం తిగిరి భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఆయనను విడుదల చేయడం వెనుక తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌‌ ఖురేషి చెప్పుకొచ్చారు. అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్‌, రష్యా, యూకే వంటి దేశాల ఒత్తిడి వల్లే భారత పైలట్‌ను పాక్‌ విడుదల చేసిందని వార్తలు వినపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘మీ (భారత) బాధను పెంచాలని మేము అనుకోలేదు. మేము శాంతిని కోరుకుంటున్నాము. పాక్‌ ప్రభుత్వం.. దేశంలో, ఇతర భూభాగాల్లో శాంతికి విఘాతం కలిగించే అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వదు. ఉగ్రవాద బృందాలను వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు మేము ప్రణాళికలు వేసుకుంటున్నాము. భారత పైలట్‌ను తిరిగి ఆ దేశానికి అప్పగించడంలో మా వెనుక ఎటువంటి ఒత్తిడి లేదు’ అని చెప్పుకొచ్చారు. ‘పాకిస్థాన్‌ తిరిగి వెనక్కి వెళ్లాలని అనుకోవట్లేదు. ఒకవేళ పాత పరిస్థితుల్లోకి వెళ్తే, మళ్లీ మేము పార్లమెంటు, పఠాన్‌కోట్‌, ఉరీ దాడుల వంటి వాటిని చూడాల్సి వస్తుంది. ఇదో పెద్ద కథ..’ అని ఖురేషి వ్యాఖ్యానించారు. కాగా, శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైష్‌ ఎ మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, పుల్వామా ఉగ్రదాడిపై తగిన ఆధారాలు సమర్పిస్తే తాము చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి కారణంగానే భారత పైలట్‌‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్థాన్ విడుదల చేసిందని స్పష్టమవుతున్నప్పటికీ, తాము శాంతికి సంకేతంగానే ఆయనను విడుదల చేశామని పాక్‌ అంటోంది.