సానియా, షోయబ్‌‌పై నెటిజన్ల ఆగ్రహం

ఇండియా – పాకిస్థాన్‌ల సరిహద్దుల్లో సైనికుల మధ్య పోరు నడుస్తుంటే.. సోషల్ మీడియాలో ఇండియా, పాకిస్థాన్ నెటిజన్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా, ఆమె భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లు చేసిన ట్వీట్లు మరింత దుమారం రేపుతున్నాయి. . ఐ.ఏ.ఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్థాన్‌కు పట్టుబడిన రోజు (ఫిబ్రవరి 27) షోయబ్ మాలిక్ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. ‘హమారా పాకిస్థాన్ జిందాబాద్’ […]

సానియా, షోయబ్‌‌పై నెటిజన్ల ఆగ్రహం
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 02, 2019 | 6:33 PM

ఇండియా – పాకిస్థాన్‌ల సరిహద్దుల్లో సైనికుల మధ్య పోరు నడుస్తుంటే.. సోషల్ మీడియాలో ఇండియా, పాకిస్థాన్ నెటిజన్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా, ఆమె భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లు చేసిన ట్వీట్లు మరింత దుమారం రేపుతున్నాయి. .

ఐ.ఏ.ఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్థాన్‌కు పట్టుబడిన రోజు (ఫిబ్రవరి 27) షోయబ్ మాలిక్ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. ‘హమారా పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ షోయబ్ చేసిన కామెంట్ భారత నెటిజన్స్‌ను ఆగ్రహానికి గురిచేసింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. సానియా భర్త ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌ హోదా నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. సానియా స్థానంలో సైనా నెహ్వాల్, పీవీ సింధూ లేదా వీవీఎస్ లక్ష్మణ్‌లను నియమించాలని కోరారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu