బిగ్ బాస్ 4: గంగవ్వను బయటికి పంపే ప్లాన్.. అందుకే టార్గెట్ చేస్తున్నారా.!
యూట్యూబర్ గంగవ్వ.. ఈ ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఈమె స్పెషల్ కంటెస్టెంట్. పల్లెటూరి అమాయకత్వం, కల్లాకపటం లేని మనసు, సహజంగా ఉండటం.. అవ్వలో ఉండే ఈ లక్షణాలే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతున్నాయి.
Bigg Boss Gangavva: యూట్యూబర్ గంగవ్వ.. ఈ ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఈమె స్పెషల్ కంటెస్టెంట్. పల్లెటూరి అమాయకత్వం, కల్లాకపటం లేని మనసు, సహజంగా ఉండటం.. అవ్వలో ఉండే ఈ లక్షణాలే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతున్నాయి. ఇదిలా ఉంటే హౌస్‌లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్లు గంగవ్వను బయటికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బయట ఆమెకున్న విపరీతమైన ఫాలోయింగ్‌ను అదునుగా చేసుకుని ఆమెను నామినేట్ చేస్తున్నారు. ఈ రెండు వారాలు గంగవ్వ ఎలా నామినేట్ అయిందో ప్రేక్షకులకు తెలిసిందే.
అటు గంగవ్వ హౌస్‌లో ఉండలేకపోతోంది. ఇక ఇదే విషయాన్ని మొన్న నాగార్జునతో కూడా చెప్పుకొచ్చింది. ఆమె ఎప్పుడు హౌస్ నుంచి బయటికి వచ్చేస్తుందో ఎవరికి తెలియదు. అయితే ప్రేక్షకులు మాత్రం ఆమెను చివరి వరకు హౌస్‌లో ఉంచాలని డిసైడ్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లు ఆమెతో పైకి బాగానే ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ.. పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారని వాదన వినిపిస్తోంది. ఆమెను ఒంటరి చేసి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా, గతంలో సంపూర్ణేష్ బాబు విషయంలోనూ ఇదే జరిగింది. అతడు కూడా హౌస్‌లో ఒంటరితనం తట్టుకోలేక బిగ్ బాస్‌తో గొడవ పెట్టుకొని మరీ వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.
Also Read:
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!
బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్
కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!