Bigg Boss 4: అదిరిపోయిన ‘అత్తా, అల్లుడు- అమెరికా మోజు’
మొదటి వారం కాస్త సోసోగానే జరిగినప్పటికీ రెండోవారంలో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ కొంతమేర పెరిగింది
Bigg Boss 4 Telugu: మొదటి వారం కాస్త సోసోగానే జరిగినప్పటికీ రెండోవారంలో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ కొంతమేర పెరిగింది. ఇక మంగళవారం ఎపిసోడ్‌లో భాగంగా అత్తా, అల్లుడు- అమెరికా మోజు అనే టాస్క్‌ని బిగ్‌బాస్ ఇచ్చారు. ఇక ఈ టాస్క్‌లో గయ్యాళి అత్తగా కరాటే కళ్యాణి, ఆమె కుమార్తెగా దివి, అమెరికా అల్లుడుగా అఖిల్, కళ్యాణి కోడలు పాత్రలో సుజాత, మతిమరుపు గుమస్తాగా కుమార్ సాయి, పని మనిషిగా దేవి నటించారు. టాస్క్ మొత్తంలో కరాటే కళ్యాణి, దేవి అదరగొట్టారు. దివి, అఖిల్, సుజాత, కుమార్ సాయి తమ తమ పాత్రల్ని పండించారు. పని మనిషి దేవి, గుమస్తా కుమార్ సాయి మధ్య లవ్ ట్రాక్ బాగా పండింది. వారిద్దరి ఎపిసోడ్ కూడా నవ్వులు పూయించింది.
ఈ ఎపిసోడ్ మధ్య మధ్యలో మిగిలిన కంటెస్టెంట్లు చేసిన చీపురు, విగ్ యాడ్‌లు అలరించాయి. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో అత్తా అల్లుడు-అమెరికా మోజు స్కిట్ బాగానే ఆకట్టుకుంది. కాగా హారిక హాట్ పెర్ఫామెన్స్, కళ్యాణి-రాజశేఖర్ మాస్టర్‌ల కామెడీ, మొనాల్-అఖిల్-అభిజిత్‌ల ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ఈ సీజన్‌కి ఊపును ఇచ్చేలా ఉన్నాయి.
Read More: