బిగ్ బాస్ 4: ఒక లైలా.. ఇద్దరు మజ్నుల ప్రేమకథ.. బట్ నో లవ్!
'లవ్ ట్రైయాంగిల్' అంటూ అభిజిత్, అఖిల్ సార్దిక్, మోనాల్ గజ్జర్ మధ్య వచ్చిన ఓ ప్రోమో కూడా సేమ్ ఈ కోవకు చెందింది.
Bigg Boss 4: ఏదో ఉందని జనాలు ఊహించుకోవాలి.. కానీ అక్కడ ఏం ఉండదు.. ఇది బిగ్ బాస్ ప్రోమోల లెక్క.. అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదే.. ఈ సీజన్ మాత్రమే కాదు, గత సీజన్లలో కూడా బిగ్ బాస్ ప్రోమోలు ఇలాగే ప్రేక్షకుల్లో ఒక హైప్‌ను తీసుకొచ్చాయి. కానీ చివరికి ఎపిసోడ్ చూసి అందరూ నిరాశచెందారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! తాజాగా ‘లవ్ ట్రైయాంగిల్’ అంటూ అభిజిత్, అఖిల్ సార్దిక్, మోనాల్ గజ్జర్ మధ్య వచ్చిన ఓ ప్రోమో కూడా సేమ్ ఈ కోవకు చెందింది. నిజానికి ఆ ప్రోమోలో ఉన్నట్లు ‘లవ్ ట్రైయాంగిల్’ ఏం లేదనే చెప్పాలి.
నిన్నటి ఎపిసోడ్‌లో మోనాల్‌ని అర్థరాత్రి పిలిచి నీతో 5 నిమిషాలు మాట్లాడాలని చెప్పిన అభిజిత్.. ‘నా మీద నీకు డౌట్ ఉందా..? నన్ను పూర్తిగా నమ్ముతున్నావా?’ అంటూ అడుగుతాడు. దానికి మోనాల్ స్పందిస్తూ.. ‘నేను నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా. కానీ నీకు నాతో కంటే ప్రపంచం అంతటితో మాట్లాడడానికి టైం ఉంటుందని’ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మార్నింగ్ వీళ్లిద్దరిని ఒక దగ్గర చేర్చి.. కెప్టెన్ లాస్య సంధి కుదురుస్తుంది.
అలాగే అటు అఖిల్, మోనాల్ మధ్య కూడా ఏదో చిన్న విషయంలో గొడవ జరుగుతుంది. అక్కడ నుంచి ఏడుస్తూ మోనాల్ వెళ్లిపోగా.. సముదాయించడానికి అఖిల్ చాలావరకు ప్రయత్నిస్తాడు. ఎక్కడా ఛాన్స్ దొరకదు. కానీ చివరికి ఒక సందర్భంలో మాట్లాడటానికి అఖిల్.. మోనాల్‌ను పిలవగా.. మోనాల్ నవ్వుతూ అఖిల్ వద్దకు వెళుతుంది. ‘ఎదవ ఓవరాక్షన్ చేయకు. మూసుకుని నడువు. నువ్వు అందరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరి గురించి నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు. ఏం తెలియదా..? అంటూ కొంచెం కఠువుగా మాట్లాడతాడు. దానికి మోనాల్ సాఫ్ట్‌గా మాట్లాడమని చెబితే.. ప్రతీసారి ప్రేమగా రాదు.. కొన్నిసార్లు ఇలా కూడా తీసుకోవాలి అని చెబుతాడు. అంతేకాదు.. నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తుంటే నేను తీసుకోలేదా?’ అని అఖిల్ రివర్స్ అడుగుతాడు. చివరికి వీళ్లిద్దరి మధ్య గొడవ సద్దుమణుగుతుంది. ఆ తర్వాత మోనాల్.. ”నాకు అభితో ఏం లేదు. నీతో ఏం లేదు. కానీ నీతో టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం” అని తన మనసులో ఉన్న ఫీలింగ్ చెబుతుంది.
ఇదంతా ఒక ఎత్తయితే.. బెడ్ రూమ్‌లో అఖిల్, అభిజిత్‌లు.. ఇదే విషయంపై డిస్కస్ చేసుకుంటారు. ‘నాకు ఒక క్లారిటీ ఉంది బ్రో. హౌస్‌లోకి ఎందుకు వచ్చాం గుర్తుపెట్టుకోవాలి. ఎవర్ని ఇంప్రెస్ చేయడానికి రాలేదు. ఒకసారి ట్రై చేయాలి.. కనెక్ట్ అయితే ఓకే.. లేదంటే లీవ్ ఇట్. ఎవరితో అయితే కలుస్తామో వాళ్ళతోనే మింగిల్ అవ్వాలి’ అని అభిజిత్ అంటాడు. దానికి అఖిల్ కూడా ‘నువ్వు కరెక్ట్ బ్రో’ అని చెబుతాడు. ఇప్పటిదాకా అయితే వీరిమధ్య సమ్‌ధింగ్.. సమ్‌ధింగ్ లేదు గానీ.. మున్ముందు సంగతి మాత్రం చెప్పలేం. కాగా, ఈ వారం నామినేట్స్‌లో గంగవ్వ, నోయల్, మోనాల్ గజ్జర్, సొహైల్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, సాయి కుమార్, దేత్తడి హారిక, అభిజిత్‌లు ఎలిమినేషన్స్‌కు నామినేట్ అయ్యారు. దీనితో బిగ్ బాస్‌లో రెండో వారం నుంచి కాస్త మజా మొదలైందని చెప్పాలి.
Also Read: బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్