రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌.. విద్యార్థులకు మార్గదర్శకాలివే

ఏపీలో ఎంసెట్‌ పరీక్షలు గురువారం(17వ తేది) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి

రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌.. విద్యార్థులకు మార్గదర్శకాలివే
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2020 | 7:05 AM

AP EAMCET 2020: ఏపీలో ఎంసెట్‌ పరీక్షలు గురువారం(17వ తేది) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. 25వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో మొత్తం 14 సెషన్లుగా పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్షకు ఈ ఏడాది 2,72,900 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది.  కోవిడ్‌ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకునేలా ఉన్నత విద్యామండలి ద్వారా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏపీ, హైదరాబాద్‌తో కలుపుకుని మొత్తం 47 ప్రాంతాల్లో 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు మార్గదర్శకాలివే:

1.మొదటి సెషన్‌ ఉదయం గం.9-12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం గం.3-6వరకు ఉంటుంది.

2. గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిని ఇస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదు.

3.ఈ–హాల్‌ టికెట్‌, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాన్ని నింపి సమర్పించాలి.

4.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది.

5. హాల్ టికెట్‌తో పాటు మరో అధికారిక ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులను బయటకు పంపరు.

6. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కచ్చితంగా మాస్క్‌, చేతి గ్లోవ్స్ ధరించాలి.

7. 50 ఎంఎల్‌ శానిటైజర్, పారదర్శకంగా ఉండే వాటర్‌ బాటిళ్లను లోపలకు అనుమతిస్తారు.

8. కరోనా లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షకు అనుమతిస్తారు.

Read More:

పొంగల్‌ తర్వాతే.. జైలు నుంచి చిన్నమ్మ బయటకు

అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా పాజిటివ్