బిగ్ బాస్ 4: మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. ‘జోకర్’ అంటూ వస్తోన్న కమెడియన్.!

బిగ్ బాస్ హౌస్‌లో అసలు మజా మొదలైంది. మొదటి వారం సోసోగానే గడిచినా.. రెండో వారంలో మాత్రం టాస్కులు, పెర్ఫార్మన్స్‌లతో కంటెస్టెంట్లు దుమ్ముదులిపేశారు.

బిగ్ బాస్ 4: మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. 'జోకర్' అంటూ వస్తోన్న కమెడియన్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 17, 2020 | 8:00 AM

బిగ్ బాస్ హౌస్‌లో అసలు మజా మొదలైంది. మొదటి వారం సోసోగానే గడిచినా.. రెండో వారంలో మాత్రం టాస్కులు, పెర్ఫార్మన్స్‌లతో కంటెస్టెంట్లు దుమ్ముదులిపేశారు. అంతేకాదు మోనాల్-అభిజిత్-అఖిల్ లవ్ స్టోరీ కూడా కొంచెం ఇంటరెస్టింగ్‌గానే సాగుతోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఇచ్చిన ‘బీబీ టాలెంట్ షో’ టాస్క్ నిన్న కూడా కంటిన్యూ అయింది. దీనికి అరియానా యాంకర్‌గా ఉంటే.. లాస్య‌, నోయ‌ల్ జ‌డ్జిలుగా వ్యవహరించారు.

అమ్మ రాజశేఖర్ సోలో డాన్స్ పెర్ఫార్మన్స్, దేవి, క‌ళ్యాణి, అభిజిత్‌, అఖిల్‌ బ‌మ్‌చిక్ ఫ్యాన్‌కు ఇచ్చిన ప్రచారం ఆకట్టుకోగా.. “వానా వానా వెల్లువాయే” సాంగ్‌కు ఇస్మార్ట్ సోహైల్‌, మోనాల్ వేసిన స్టెప్‌లు హైలైట్‌గా నిలిచాయి. అటు మెహ‌బూబ్‌, హారికలు అయితే డాన్సులతో దుమ్మురేపి ‘స్టార్ ప‌ర్ఫార్మ‌ర్ ఆఫ్ ది షో’ అవార్డులు గెలుచుకున్నారు. ఆ తర్వాత గంగవ్వ పెర్ఫార్మన్స్, చివరిగా అందరి ఇంటి స‌భ్యులు క‌లిసి డ్యాన్స్ చేయడంతో ఈ కార్యక్రమం ముగిసింది.(Bigg Boss 4 Telugu)

కాగా, ఈ వారం బిగ్ బాస్ రెండో వైల్డ్ కార్డు ఎంట్రీని సిద్దం చేశాడు. ‘జోకర్ వెనుక జీవిత‌మే ఉందంటూ’ వస్తోన్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో.. కొత్త కంటెస్టెంట్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక అతను ఖచ్చితంగా ముక్కు అవినాష్ అని నెటిజన్లు భావిస్తున్నారు. మరి అతనెవరో ఈరోజు ఎపిసోడ్‌లో తేలిపోనుంది.

Also Read:

బిగ్ బాస్ 4: గంగవ్వను బయటికి పంపే ప్లాన్.. అందుకే టార్గెట్ చేస్తున్నారా.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!