‘ఏపీ, తెలంగాణతో పాటు 12 రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ యాక్టివ్‌గా ఉంది’

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ముప్పు భారతదేశంలో కొనసాగుతోంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ గ్రూప్ యాక్టివ్‌గా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

'ఏపీ, తెలంగాణతో పాటు 12 రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ యాక్టివ్‌గా ఉంది'
Follow us

|

Updated on: Sep 17, 2020 | 8:50 AM

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ముప్పు భారతదేశంలో కొనసాగుతోంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ గ్రూప్ యాక్టివ్‌గా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆ లిస్టులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు ఉన్నాయన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఈ ఉగ్రవాద సంస్థలోకి చేరుతుండటంతో కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల దృష్టికి వచ్చిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

యువతను ఉగ్రవాదం వైపు మళ్ళించేందుకు ఐఎస్ఐఎస్ సోషల్ మీడియాను వినియోగిస్తోందని రాజ్యసభలో తెలిపారు. బీజేపీ ఎంపీ పీ. సహస్రాబుద్దే అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి పైవిధంగా లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. ”వారి ఇంటర్నెట్ కదలికలపై ఎప్పటికప్పుడు భారత ఏజెన్సీలు నిఘా ఉంచాయని.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని” కిషన్ రెడ్డి తెలిపారు.

2014 నుండి సిరియా, ఇరాక్‌ దేశాలపై పట్టు సాధించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ.. బంగ్లాదేశ్, మాలి, సోమాలియా, ఈజిప్ట్ వంటి దేశాలను తమ అడ్డాలుగా మార్చుకుని కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఐఎస్ఐఎస్.. లష్కర్-ఎ-తైబా, అల్-ఖైదా వంటి ఇతర ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు ఏర్పరుచుకుంది. అటు భారతదేశంలోని యువతను ఉగ్రవాదం వైపు మళ్ళించేందుకు.. తమ భావజాలాన్ని ప్రచారం చేయడానికి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తూ వస్తోంది.

తాజాగా ఎన్‌ఐఏ చేసిన ఓ దర్యాప్తులో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, రాజస్తాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ చురుగ్గా ఉన్నట్లు వెల్లడైందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ ఉనికికి సంబంధించి ఎన్ఐఏ 17 కేసులు నమోదు చేసిందని.. ఇప్పటికే 122 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసిందని ఆయన అన్నారు. (ISIS most active in 12 Indian states)

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..