సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!

గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి చంద్రారెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!
Follow us

|

Updated on: Sep 16, 2020 | 2:34 PM

Sachivalayam Exams: గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి చంద్రారెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. కరోనా నేపధ్యంలో సచివాలయ పోస్టుల భర్తీకి జరుగుతున్న పరీక్షలకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అంతేకాకుండా కరోనా పాజిటివ్ అభ్యర్ధులకు ఐసోలేషన్ రూంలలో పరీక్ష నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఆ గదుల్లో ఇన్విజిలేటర్లు పీపీఈ కిట్లు ధరిస్తారని అని తెలిపారు. ఇక 16,208 పోస్టులకు 10,56,931 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కాగా, గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ఈనెల 20 నుంచి 26 వరకు జరగనున్నాయి. gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే అభ్యర్థుల కోసం ఈసారి ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలకు సంబంధించిన గూగుల్ మ్యాప్స్ వివరాలను అందుబాటులో ఉంచారు.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!