Breaking News
  • అసెంబ్లీ లో మంత్రి కేటీఆర్: ప‌్ర‌పంచం మెచ్చిన గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ న‌గ‌రం అవ‌త‌రిస్తోంది. రాష్ర్ట ఏర్పాటు త‌ర్వాత తెలంగాణ‌లో అత్యంత వేగంగా ప‌ట్ట‌ణీక‌ర‌ణ చెందింది. తెలంగాణ ప‌ట్ట‌ణీక‌ర‌ణ 42.6 శాతానికి చేరుకుంది. దేశ స‌గ‌టు ప‌ట్ట‌ణ జ‌నాభా 31.2 శాతం మాత్ర‌మే. తెలంగాణ‌లో అనేక పాల‌న సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టింది. పెరుగుతున్న ప‌ట్ట‌ణీక‌ర‌ణ దృష్ట్యా 74 కొత్త మున్సిపాలిటీలు, 7 కొత్త మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసింది. రాష్ర్టంలో 142 పుర‌పాలిక‌ల‌కు రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేస్తూ ఉపాధి క‌ల్ప‌న‌ను పెంపొందిస్తున్నాం. క‌ట్టుదిట్ట‌మైన శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అమ‌లు చేస్తున్నాం. ఈ క్ర‌మంలో ప్ర‌పంచం మెచ్చిన గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ అవ‌త‌రిస్తోంది.
  • విశాఖ: సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసు . నిందితులకు కోర్టులో చుక్కెదురు. డాక్టర్ నమ్రత సహా 15 మంది బెయిల్ నిరాకరణ. నిందితులు వేసుకున్న బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన కోర్ట్.
  • కోల్‌కత్తాలో ఓ మహిళా న్యాయవాదికి జీవితఖైదు. తీర్పు వెల్లడించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు. మొబైల్ చార్జింగ్ కేబుల్‌తో గొంతుకు ఉచ్చుబిగించి భర్తను హతమార్చిన న్యాయవాది.
  • విశాఖ: శిరోముండనం కేసు. నూతన్ నాయుడుకు బెయిల్ నిరాకరణ. బెయిల్ కోరుతూ 8 మంది నిందితుల పిటిషన్.. బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్ట్.
  • సింగీతం శ్రీనివాస‌రావుకు కోవిడ్ పాజిటివ్‌: సెప్టెంబ‌ర్ 9న కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డించిన సింగీతం. ఈ నెల 21న సింగీతం పుట్టిన‌రోజు. ఈ నెల 22న హోమ్ ఐసొలేష‌న్ పూర్త‌వుతుంద‌ని సింగీతం వెల్ల‌డి. చిన్న‌పాటి ఇన్‌ఫెక్ష‌న్ ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఇంట్లోనే ప్ర‌త్యేక గ‌దిలో ఉన్న‌ట్టు వెల్ల‌డించిన సింగీతం. తానెప్పుడూ పాజిటివ్‌గానే ఉంటాన‌ని వెల్ల‌డించిన సింగీతం. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటే హాస్ట‌ల్ రోజులు గుర్తుకొస్తున్నాయ‌ని చ‌మ‌త్క‌రించిన సింగీతం. సింగీతం శ్రీనివాస‌రావుకి 88 ఏళ్లు. కోవిడ్ ప‌ట్ల అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న‌. మాస్కులు ధ‌రించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని వెల్ల‌డి.
  • చెన్నై : నటుడు సూర్య సినిమా సూరరై పోట్రు కి కొత్తచిక్కులు, డిజిటల్ మీడియా లో సినిమా విడుదలను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ . సూర్య నటించిన సినిమా సూరరై పోట్రు లో అగ్రవర్ణాలను కించపరుస్తూ , దళితులు , అగ్రవర్ణాల మధ్య గొడవలకు దారి తీసేలా సినిమా లో పాట ఉందని ధర్మపురికి చెందిన కార్తీక్ ఆరోపణ దీనిపై విచారించిన మద్రాస్ హైకోర్టు తక్షణమే కేసు నమోదు చేసి ,దీనికి బాధ్యులైన వారి ఫై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు .
  • హైదరాబాద్ దుర్గం చెరువు బ్రిడ్జి ప్రారంభ ముహూర్తం ఖరారు . 19వ తేదీన సాయంత్రం 5గంటలకి మంత్రి ktr చేతులమీదుగా ప్రారంభం . గత నెల 4న ప్రారంభం కావాల్సి ఉన్న ప్రణబ్ సంతాప దినాలు కావడంతో వాయిదా. రోడ్ no45 నుండి దుర్గం చెరువు కి కనెక్టివిటీ . దేశంలోనే రెండవ అతి పెద్దగా తీగల వంతెన గా..దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి.
  • చెన్నై : దొంగతనానికి గురైన విగ్రహాలు నలబై ఏళ్ల తర్వాత వెనక్కి . భారతదేశానికి విగ్రహాలు అప్పగించిన బ్రిటన్ . నాగపట్నం జిల్లా అనంతమంగళం రాజగోపాల స్వామి ఆలయంలో 1978 లో దొంగతనం . సీతారామ , లక్ష్మణ విగ్రహాలు చోరీ . లండన్ కు చేరిన చోరీ అయిన విగ్రహాలు . లండన్ లో ఉన్నట్టు గుర్తించిన తమిళనాడు పోలీసులు . ఈ విగ్రహాలు తమ అలాయానివే అంటూ ఆధారాలు బ్రిటన్ ప్రభుత్వానికి పంపిన నాగపట్నం కలెక్టర్ . ఆధారాలు మ్యాచ్ అవడంతో విగ్రహాలను అప్పగించిన లండన్ అధికారులు . లండన్ లోని భారత హై కమిషనర్ గైత్రి ఇస్సార్ కుమార్ ఆధ్వర్యంలో విగ్రహాల అప్పగింత . త్వరలోనే తిరిగి విగ్రహాలను ప్రతిష్టించనున్న అధికారులు.

బిగ్ బాస్ 4: గంగవ్వను బయటికి పంపే ప్లాన్.. అందుకే టార్గెట్ చేస్తున్నారా.!

యూట్యూబర్ గంగవ్వ.. ఈ ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఈమె స్పెషల్ కంటెస్టెంట్. పల్లెటూరి అమాయకత్వం, కల్లాకపటం లేని మనసు, సహజంగా ఉండటం.. అవ్వలో ఉండే ఈ లక్షణాలే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతున్నాయి.
Bigg Boss Gangavva, బిగ్ బాస్ 4: గంగవ్వను బయటికి పంపే ప్లాన్.. అందుకే టార్గెట్ చేస్తున్నారా.!

Bigg Boss Gangavva: యూట్యూబర్ గంగవ్వ.. ఈ ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఈమె స్పెషల్ కంటెస్టెంట్. పల్లెటూరి అమాయకత్వం, కల్లాకపటం లేని మనసు, సహజంగా ఉండటం.. అవ్వలో ఉండే ఈ లక్షణాలే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతున్నాయి. ఇదిలా ఉంటే హౌస్‌లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్లు గంగవ్వను బయటికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బయట ఆమెకున్న విపరీతమైన ఫాలోయింగ్‌ను అదునుగా చేసుకుని ఆమెను నామినేట్ చేస్తున్నారు. ఈ రెండు వారాలు గంగవ్వ ఎలా నామినేట్ అయిందో ప్రేక్షకులకు తెలిసిందే.

అటు గంగవ్వ హౌస్‌లో ఉండలేకపోతోంది. ఇక ఇదే విషయాన్ని మొన్న నాగార్జునతో కూడా చెప్పుకొచ్చింది. ఆమె ఎప్పుడు హౌస్‌ నుంచి బయటికి వచ్చేస్తుందో ఎవరికి తెలియదు. అయితే ప్రేక్షకులు మాత్రం ఆమెను చివరి వరకు హౌస్‌లో ఉంచాలని డిసైడ్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లు ఆమెతో పైకి బాగానే ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ.. పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారని వాదన వినిపిస్తోంది. ఆమెను ఒంటరి చేసి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా, గతంలో సంపూర్ణేష్ బాబు విషయంలోనూ ఇదే జరిగింది. అతడు కూడా హౌస్‌లో ఒంటరితనం తట్టుకోలేక బిగ్ బాస్‌తో గొడవ పెట్టుకొని మరీ వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..!

Related Tags