AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరియానా దెబ్బతో గుక్కపెట్టి ఏడ్చిన మోనాల్.. నా మీద ఇంత పగా.. నీ గురించి ఇంత తెలిశాక ఇక నేను సహించను అంటూ..

బిగ్‏బాస్ షో ఫినాలేకు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో కంటెస్టెంట్స్ మరింత కసిగా గేమ్ ఆడుతున్నారు. ఇందుకు బిగ్‏బాస్ కూడా వాళ్ళకు రకరకాల టాస్కులు ఇస్తూ వాళ్ళలో

అరియానా దెబ్బతో గుక్కపెట్టి ఏడ్చిన మోనాల్.. నా మీద ఇంత పగా.. నీ గురించి ఇంత తెలిశాక ఇక నేను సహించను అంటూ..
Rajitha Chanti
|

Updated on: Dec 09, 2020 | 7:06 AM

Share

బిగ్‏బాస్ షో ఫినాలేకు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో కంటెస్టెంట్స్ మరింత కసిగా గేమ్ ఆడుతున్నారు. ఇందుకు బిగ్‏బాస్ కూడా వాళ్ళకు రకరకాల టాస్కులు ఇస్తూ వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‏లో ఇలాంటి టాస్కే ఇచ్చారు బిగ్‏బాస్. ఈ టాస్క్ లో మోనాల్, అరియానా మధ్య పెద్ద రచ్చే జరిగింది. ముఖ్యంగా అరియానా మోనాల్ పై ఉన్న కోపాన్ని మొత్తం బయటకు తీసింది. దీంతో మోనాల్ గుక్కపెట్టి ఏడ్చేసింది.

ఓపిక అనే టాస్క్ లో ఇంటి సభ్యులు ఏ హావభావం లేకుండా రోబోట్ లా కూర్చొని ఉండాలని బిగ్‏బాస్ తెలిపారు. అంటే ఒక సభ్యుడు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన టేబుల్ పై రోబోట్ లా కూర్చోవాలి. మిగిలిన ఇంటి సభ్యులు ఏదైనా చేసిన కూర్చున్న సభ్యుడిని వీలైనన్ని ఎక్కువ ఎక్స్‏ప్రెషన్స్ బయటకు వచ్చేలా చేయాలి. టాస్క్ ముగిసేసరికి ఏ సభ్యుడు అయితే ఎన్ని ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారో అఖిల్ బోర్డుపై రాయాలి. అంతేకాకుండా టేబుల్ దగ్గర నాలుగు ఎక్స్‏ప్రెషన్స్‏తో కూడిన ఫేస్ బొమ్మలను కూడా ఉంచారు. ఏ ఫేస్ బొమ్మ వెలిగితే ఆ ఎక్స్‏ప్రెషన్స్‏ను టేబుల్ పై కూర్చున్న వ్యక్తితో మిగిలిన నలుగురు ఇంటి సభ్యులు ఏదైనా చేసి పెట్టించగలగాలి.

ఇందులో మొదటిగా అరియానాకు ఛాన్స్ వచ్చింది. దీంతో ఆమెతో ఎక్స్ ప్రెషన్స్ తెప్పించడానికి సోహైల్, మోనాల్ చాలా ప్రయత్నించారు. కానీ అరియానా మాత్రం తన ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకుంది. ఎలాగైనా అరియానాతో ఎమోషన్స్ తెప్పించడానికి ఆమెకు ఇష్టమైన చింటు బొమ్మను హారిక తీసుకురాగా, ఆ బొమ్మను మోనాల్ బయటకు విసిరెసింది. దీంతో ఆ బొమ్మ ఎక్కడో గోడపై పడింది. అంతేకాకుండా అరియానా డ్రెస్‏లో ఐస్ క్యూబ్ వేసింది. ఇన్ని ప్రయాత్నాలు చేసిన అరియానా మాత్రం 4 ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే ఇచ్చింది.

ఇక మోనాల్ రోబోలా కూర్చోగా అరియానా అప్పటివరకు తన మనసులో దాచుకున్న కోపాన్ని అంతా కక్కేసింది. అవినాష్‏ను తన్ని మరీ ఓ ఎక్స్ ప్రెషన్ ఇచ్చావని. నా మీద ఎంత పగుందో ఇప్పటికైనా బయటపడిందని తెలిపింది. నా బొమ్మను ఇంటి బయట పడేయాలనుకున్నావు. నన్ను బాధ పెట్టాలనుకున్నావు. మనసులో ఇంత పగ ఉన్నప్పుడు నన్ను ముందు ఇన్ని రోజులు నటించావా? అడి అడిగింది. ఇవే కాకుండా ఇంకా చాలా మాటలు అనేసింది. దీంతో మోనాల్ ఓంటరిగా గుక్కపెట్టి ఏడ్చేసింది. బిగ్‏బాస్ ఆమెను ఓదార్చడానికి కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు. మోనాల్ విషయంలో సోహైల్, అరియానా మధ్య పెద్ద గొడవే జరగబోతుంది. ఈ ప్రోమోను నేటి ఎపిసోడ్ చివరిలో చూపించారు. మరి ఆ విషయాలను రేపు బిగ్‏బాస్ ఎపిసోడ్ లో చూడాలి.

Follow Us
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం