Bigg Boss 4: మోనాల్, హారిక, అరియానా.. లేడి బిగ్‌బాస్ కల ఈ సీజన్ కూడా నెరవేరదా..!
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 4 దాదాపుగా ఫైనల్‌కి వచ్చేసింది. ప్రస్తుతం హౌజ్‌లో ఆరు మంది మిగిలారు. వారిలో అరియానా, అవినాష్, అభిజిత్, అఖిల్,
Bigg Boss 4 Telugu: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 4 దాదాపుగా ఫైనల్‌కి వచ్చేసింది. ప్రస్తుతం హౌజ్‌లో ఆరు మంది మిగిలారు. వారిలో అరియానా, అవినాష్, అభిజిత్, అఖిల్, హారిక, మోనాల్, సొహైల్‌లు ఉన్నారు. ఇందులో అభి, సొహైల్‌లు ఇప్పటివరకు టాప్ 2లో ఉన్నారు. అయితే తెలుగులో బిగ్‌బాస్ ఇప్పటివరకు మూడు సీజన్లను పూర్తి చేసుకోగా అందులో ఒక్క లేడి బిగ్‌బాస్ కూడా లేదు.
ఈ క్రమంలో ఈసారి అయినా లేడి బిగ్‌బాస్ విన్నర్ అవ్వాలని ముందు నుంచి అంటూ వస్తోన్న అరియానా చాలా స్ట్రాంగ్‌గా గేమ్ ఆడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె టాప్ 5లో ఉండే అవకాశాలు ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక మోనాల్‌ని మొదటి నుంచి బిగ్‌బాస్ కాపాడుతూ వస్తున్నట్లు షో చూస్తున్న వారికి అర్థమవుతూ వస్తోంది. ఇక షో ఫైనల్‌కి వస్తోన్న నేపథ్యంలో మోనాల్‌పై బిగ్‌బాస్ అదే ప్రేమను చూపితే హారిక బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే హారికకు టాప్ 5లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈసారి కూడా లేడి విన్నర్ అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు అర్థమవుతోంది. చూడాలి మరి ఈ సీజన్ విజేతగా ఎవరు నిలవనున్నారో..!