Bigg Boss 4: తెలుగు బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చిన కన్నడ స్టార్ .. అతన్నికూడా బుట్టలో వేసుకున్న మోనాల్

బిగ్ బాస్ షో రోజు రోజుకు ఆసక్తిగా మారుతుంది. చివరి అంకానికి వచ్చిన బిగ్ బాస్ లో ఎవరు విజేతగా నిలుస్తారని ప్రేక్షకులంతా  ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ఆదివారం కావడంతో  కంటెస్టెంట్ లో జోష్ నింపడానికి నాగార్జున సిద్ధమయ్యారు. అయితే  గ‌తంలో బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది స్టార్స్ త‌మ సినిమాల‌ని ప్ర‌మోట్ చేసుకున్నారు..

Bigg Boss 4: తెలుగు బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చిన కన్నడ స్టార్ .. అతన్నికూడా బుట్టలో వేసుకున్న మోనాల్
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 29, 2020 | 2:29 PM

బిగ్ బాస్ షో రోజు రోజుకు ఆసక్తిగా మారుతుంది. చివరి అంకానికి వచ్చిన బిగ్ బాస్ లో ఎవరు విజేతగా నిలుస్తారని ప్రేక్షకులంతా  ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ఆదివారం కావడంతో  కంటెస్టెంట్ లో జోష్ నింపడానికి నాగార్జున సిద్ధమయ్యారు. అయితే  గ‌తంలో బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది స్టార్స్ త‌మ సినిమాల‌ని ప్ర‌మోట్ చేసుకున్నారు.కానీ ఈసారి కరోనా కారణంగా అంతగా ఎవ్వరు స్టార్స్ రాలేదు. మధ్యలో ఒక రోజు సమంత హోస్ట్ గా మారి సందడిచేయగా అఖిల్ గెస్ట్ గా వచ్చాడు. ఈ రోజు క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ త‌న తాజా చిత్రం ఫాంథ‌మ్ ప్రమోష‌న్‌లో భాగంగా బిగ్ బాస్ షోకు హాజ‌ర‌య్యాడు.  ఇందుకు సంబంధించిన ప్రోమోను విదుదల చేశారు.

నాగ్ ప్లేస్ లో హోస్ట్ గా సుధీప్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరు షాక్ అయ్యారు. అరియనా నాగ్ సార్ ఎక్కడ అని అడగడంతో సుదీప్ ఇంటికి వెళ్లిపోయారు అని సమాధానం ఇచ్చాడు. తర్వాత మీకు నాగ్ సార్ ఎందుకు కావలి అని సుదీప్ అడగగా హారికా వీ లవ్ నాగ్ సార్ అని చెపింది. ఆతర్వాత అభిజీత్ నాగ్ సార్ కింగ్, అంటూ పొగిడేసాడు. వెంటనే నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత అవినాష్ ను బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరితో డేట్ చేస్తావ్.?, ఎవరిని పెళ్లిచేసుకుంటావ్.?, ఎవరిని చంపేస్తావ్.? అని అడిగి ఆటపట్టించాడు సుదీప్. ఇక మోనాల్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ ముద్దుగా మాట్లాడి సుదీప్ ను ఫిదా చేసింది. అయితే ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి తనను తాను సేవ్ చేసుకున్నాడు అవినాష్.అలా ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా బయటికి వెళ్లలేదు. దాంతో ఈ వారం నో ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ తర్వాత నాలుగు వారాల్లో రెండు వారాల్లో ఇద్దర్ని ఎలిమినేట్ చేసి..చివరి రెండు వారాల్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటారు.వీరిలో ముగ్గురు కంటెస్టెంట్స్ వెళ్ళిపోతే ఇద్దరు మిగులుతారు. ఆ ఇద్దరిలో విజేతను ప్రకటించనున్నారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!