Bigg Boss 4: మోనాల్‌ను సేవ్ చేస్తుంది ఎవరో తెలిసిపోయింది.. వాళ్ళవల్లే తొమ్మిది సార్లు ఈ అమ్మడుసేవ్ అయ్యింది.
బిగ్ బాస్ సీజన్4 లో రసవత్తరంగా సాగుతుంది. నేటితో బిగ్ బాస్ సీజన్ 4 పన్నెండో వారం కంప్లీట్ చేసుకోబోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్, సొహైల్, మోనాల్, అభిజిత్, అవినాష్, అరియానా మరియు హారికలు మిగిలి ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్4 లో రసవత్తరంగా సాగుతుంది. నేటితో బిగ్ బాస్ సీజన్ 4 పన్నెండో వారం కంప్లీట్ చేసుకోబోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్, సొహైల్, మోనాల్, అభిజిత్, అవినాష్, అరియానా మరియు హారికలు మిగిలి ఉన్నారు. వీరిలో అఖిల్ , మోనాల్ , అవినాష్ , అరియనా నామినేషన్ లో ఉన్నారు. అయితే హౌస్‌లో ఎక్కువ సార్లు నామినేట్ అయినవారిలో మోనాల్ ఒకరు.
కానీ, నామినేట్ అయిన ప్రతి వారం ఎలిమినేట్ అవుతుంది అనుకున్న ప్రతీసారి ఈ అమ్మడు సేవ్ అవుతూ వస్తుంది. మోనాల్ ప్రతిసారి సేవ్ కావడంతో ఈ అమ్మడిని ఎవరు సేవ్ చేస్తున్నారన్న డౌట్ అందరిలో మొదలయింది. గత 11 వారాల్లో 9 సార్లు నామినేట్ అయ్యి సేవ్ అవుతున్న మోనాల్‌కి ఓట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి? అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెను సేవ్ చేసేది గుజరాతీయులట. మోనాల్ తెలుగమ్మాయి కాదు.. గుజరాత్ నుంచి వచ్చింది. సినిమాల ద్వారా అక్కడ మోనాల్ కు మంచి ఫాలోయింగే ఉంది. ఇప్పుడు ఆ అభిమానమే మోనాల్‌ను కాపాడుతుందట. మోనాల్ తెలుగు బిగ్ బాస్‌కు వచ్చిందని తెలుసుకుని అక్కడి నుంచి అభిమానులు ఈమెకు ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తుంది.ఇలా గుజరాతీలు ఓట్లు వేస్తూ.. మోనాల్ ను గెలిపించిన ఆశ్చర్యపోనక్కర్లేదేమో..