Bigg Boss 4: అభిజీత్‌ను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటున్న నెటిజన్లు .. నాగ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్
బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది. ప్రేక్షకులంతా ఎవరు విజేత అవుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మొదట్లో చప్పగా సాగిన బిగ్ బాస్4 ఇప్పుడు రసవత్తరంగా మారింది. విచిత్రమైన టాస్కులు , వింత వింత గేమ్స్ , ఇంటిసభ్యులమధ్య గొడవలు..
బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది. ప్రేక్షకులంతా ఎవరు విజేత అవుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మొదట్లో చప్పగా సాగిన బిగ్ బాస్4 ఇప్పుడు రసవత్తరంగా మారింది. విచిత్రమైన టాస్కులు , వింత వింత గేమ్స్ , ఇంటిసభ్యులమధ్య గొడవలు ఇలా బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 4 కు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి వారం ఇంటిసభ్యులను ఉత్సాహపరుస్తూ వస్తున్న నాగ్ పై ఇప్పుడు నెటిజన్లు మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో మన్మధుడి పై ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే…
నిన్న శనివారం కావడంతో నాగార్జున హౌస్ మేట్స్ తో ముచ్చటించారు. వారం మొత్తమీద ఇంటిసభ్యులు చేసిన తప్పులను నాగ్ ఎత్తిచూపారు. ఈ క్రమంలోనే అభిజీత్ కు నాగార్జున ఫుల్ క్లాస్ పీకారు. ఒక్కొక్కరిని వారు చేసిన తప్పులగురించి ప్రశ్నించిన నాగ్. అభిజీత్ వంతు వచ్చేసరికి బిగ్ బాస్ గేట్లు తెరవండి అంటూ షాక్ ఇచ్చాడు. ఆతర్వాత అభిజీత్ చేసిన తప్పులను చెప్పుకొచ్చాడు నాగార్జున. ‘మోనాల్ టాస్క్ నాకు చాలా పర్సనల్‌గా అనిపించింది. నేను ఎప్పుడు మోనాల్‌ని ఏడిపించాను సర్ .. మోనాల్‌తో లింక్ చేయకండని ఎన్నోసార్లు అభ్యర్థించాను’ అంటూ అభిజీత్ అనడంతో నాగ్ ఓ వీడియో చూపించి మరీ అభికి క్లాస్ తీసుకున్నాడు. ఈవిషయంలో నాగ్ పై అభిజీత్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో నాగ్ పై ట్రోల్స్ చేస్తున్నారు. అభిజీత్ పై నాగ్ అంతగా ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు. అతడిని కావాలనే టార్గెట్ చేస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ‘స్టాప్ టార్గెటింగ్ అభి’ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.