Bigg Boss 4: ఏదో అద్భుతం జరిగితే తప్ప.. ఈ సీజన్ విన్నర్‌గా నిలవనున్న అభిజిత్..!
తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ 4 షో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ షో 12 వారాలను పూర్తి చేసుకుంది. మరో మూడు వారాల్లో ఈ షోను ముగించేలా నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Abhijeet Bigg Boss 4: తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ 4 షో విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ షో 12 వారాలను పూర్తి చేసుకుంది. మరో మూడు వారాల్లో ఈ షోను ముగించేలా నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టాప్ 2లో అభిజిత్, సొహైల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరిలోనూ ఈ సీజన్ విన్నర్‌గా అభి పేరు బాగా వినిపిస్తోంది.
కాగా ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అభి ఉంటూ వస్తున్నారు. అయితే సీజన్ ప్రారంభంలో మోనాల్‌తో పులిహోర కలిపేందుకు తెగ ప్రయత్నించిన అభి.. పెద్దగా ఆట మీద ఫోకస్ చేయలేదు. ఇక ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నప్పటి నుంచి అభి చాలా మారిపోయాడు. తన ఆట తానే ఆడుతున్నాడు. తాను చెప్పాలనుకున్నది ఏదైనా మొహం మీదనే చెప్పేస్తున్నాడు. అలాగే ఎవరైనా చెప్పినా దాన్ని వింటూ వస్తున్నాడు. కానీ టాస్క్‌ల విషయంలో అతడిపై బాగా నెగిటివ్ వచ్చింది. ఏదో ఒకటి, రెండు మినహా అనారోగ్య సమస్యలతో కొన్ని ఫిజికల్ టాస్క్‌లలో అభి పాల్గొనలేదు. ఇదే కారణాన్ని చూపుతూ వచ్చిన కొందరు కంటెస్టెంట్‌లు ఎలిమినేషన్ సమయంలో అతడిని నామినేట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే గత వారం జరిగిన టాస్క్‌లో మాత్రం పాల్గొన్న అభి.. ఇంకోసారి ఫిజికల్ టాస్క్ కారణం చూపకండి అని అందరికీ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. ఇలా అభి చాలా స్ట్రాంగ్‌గా మారిపోయాడు.
మరోవైపు గత వారం వచ్చిన కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్లలలో అరియానా సోదరి మినహా.. మిగిలిన అందరూ అభి టాప్ 5లో ఉంటాడని చెప్పారు. దీంతో అభిజిత్‌కి మరింత బూస్టప్ లభించినట్లైంది. ఇలా మొత్తానికి టాప్‌లో ఉంటూ వస్తోన్న అభి.. ఈ సీజన్ విన్నర్‌గా నిలుస్తాడని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఇంకా గ్రాండ్ ఫైనల్‌కి సమయం ఉంది. ఇన్ని రోజులు ఎలా ఉన్నా.. ఇప్పటి నుంచి అభిజిత్ గేమ్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. బిగ్‌బాస్ అంటే ఏమైనా జరగొచ్చు కాబట్టి.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సీజన్ విన్నర్ మాత్రం అభిజిత్ అవ్వడం ఖాయమన్నది ప్రేక్షకుల మాట.