హైదరాబాద్‌లో రాజకీయ చాణక్యుడు.. ముగిసిన అమిత్ షా రోడ్ షో..పెద్దఎత్తున తరలివచ్చిన బీజేపీ శ్రేణులు
బేగంపేట నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారసిగూడలో రోడ్ షో పాల్గొంటున్నారు.
Amit Shah Live Update : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన పాతబస్తీకి వెళ్లారు. అక్కడ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారాసిగూడలో రోడ్ షో కొనసాగింది.
సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్ అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. అయితే సీతాఫల్‌మండిలోని హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగాల్సి ఉండగా… రోడ్డు షోకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో మధ్యలోనే ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అమిత్ షాకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Also Read :
గ్రేటర్ దంగల్ : బీజేపీ బల్దియా ఎన్నికలను ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..?