హత్యాయత్నంపై స్పందించిన పేర్ని నాని, కృష్ణా జిల్లా ఎస్పీ.. నిందితుడు అందుకే దాడి చేశాడట
రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఏపీలో కలకలం రేపుతోంది. మచిలీపట్నంలో ఆయన నివాసం వద్ద నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో మంత్రిపై దాడి చేశాడు.
రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఏపీలో కలకలం రేపుతోంది. మచిలీపట్నంలో ఆయన నివాసం వద్ద నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో మంత్రిపై దాడి చేశాడు. మినిస్టర్ నాని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కాగా తాజాగా పేర్ని నాని ఈ ఘటనపై స్పందించారు.
“మా ఇంటి గేటు వద్ద ఒక వ్యక్తి కాళ్లపై పడ్డాడు. ఎవరో గుర్తించేలోగా పొడిచేందుకు ప్రయత్నించాడు. తప్పించుకోగా..మరోసారి పొడవాలని చూశాడు. వెంటనే నా అనుచరులు అతడిని పట్టుకుని..పోలీసులకు అప్పగించారు. ఎందుకు దాడి చేశాడో తెలియదు. పోలీసులు విచారణలోనే వాస్తవాలు తెలియాలి” అని మంత్రి నాని పేర్కొన్నారు.
ఇక ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు మాట్లాడారు. మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, హత్యాయత్నంపై కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రాధమిక దర్యాప్తులో తాపీ మేస్త్రీ అయిన తనకు కొద్ది రోజులుగా పని లేకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడని నిందితుడు చెబుతున్నట్లు వెల్లడించారు. పూర్తి విచారణ తర్వాత హత్యాయత్నానికి సంబంధించిన కారణాలు వెల్లడిస్తామన్నారు.
Also Read :
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో క్రేజీ ఫీట్, భారత కెప్టెనా, మజాకా!