లేటు వయసులో ఘాటు నిర్ణయం.. త్వరలో ఓ సినిమాలో నటించబోతున్న దర్శకుడు రాఘవేంద్రరావు..
శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం. ఆయన సినిమాల ద్వారా ఎంతోమంది హీరోలు,హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్లుగా చెలామణి అవుతున్నారు.
శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం. ఆయన సినిమాల ద్వారా ఎంతోమంది హీరోలు,హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్లుగా చెలామణి అవుతున్నారు. ఒక్కసారి దర్శకేంద్రుడి చేతిలో పడితే చాలు జన్మధన్యం అయినట్లుగా ఫీలవుతుంటారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోల కుమారులను కూడా ఈయన దర్శకత్వంలోనే ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది.ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ప్రస్తుత హీరోల వరకు ఎంతో మందిని డైరెక్ట్ చేశాడు కానీ ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించలేదు.
ప్రస్తుతం 78 ఏళ్ల రాఘవేంద్రరావు నటనపై మనసు పారేసుకున్నాడు. తనికెళ్ల భరణి తీస్తున్న ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఇందులో సమంత, శ్రియ శరణ్, రమ్యకృష్ణ నటిస్తున్నట్లు తెలిసింది. సినిమాల ఫంక్షన్లలలో కానీ మరెక్కడైనా కానీ పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడని రాఘవేంద్రరావు సడెన్‌గా సినిమాలో నటించడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. లేటు వయసులో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియాలంటే ఆయన నోరు విప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే తన సినిమాలో రాఘవేంద్రరావు నటిస్తున్నాడని అఫిషియల్‌గా ప్రకటిస్తామని తనికెళ్ల భరణి చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను వెల్లడిస్తామని ప్రకటించారు. మరి రాఘవేంద్రరావు ఎలా నటించాడో చూడాలంటే ఆయన అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.